ఎంజిఆర్, ఎన్టీఆర్ లాగే కెసిఆర్: నటుడు సుమన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని జపాన్ రాజధాని టోక్కో నగరంలో చూడాలని తాను ఆశిస్తున్నట్లు తెలుగు సినీ నటుడు సుమన్ తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అవలంబిస్తున్న విధానాలతో తెలంగాణ రాష్ట్రం టోక్యో మాదిరిగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. కరీంనగర్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మొదటి జాతీయ స్థాయి కరాటే, కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆపదలో ఉన్న రైతులన ఆదుకునేలా రైతు కార్డులివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. మార్షల్ ఆర్‌ట్సను అగ్రస్థానంలో నిలిపేలా కేసీఆర్ ప్రభుత్వం సహకరించాలన్నారు. హైదరాబాద్ నేతృత్వంలో హైదరాబాద్ ఫిల్‌మ సిటీ దేశంలోనే నెంబర్ 1 గా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ రంగంలో ఆర్ అనే అక్షరానికి ప్రత్యేక ఉందని చెప్పారు. సినిమా రంగం నుంచి వచ్చిన ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా రాణిస్తే రాజకీయ రంగం నుంచి కెసిఆర్ రాణిస్తున్నారని ఆయన అన్నారు. క్రీడారంగానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రజానీకం, ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన సూచించారు.
వచ్చే ఐదేళ్లలో హైదరాబాదులో సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే ప్రపంచ చలనచిత్ర నిర్మాణానికి వేదిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు రైతు సమస్యలు అంతటా ఉంటాయని, వాటి సాకుతో ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications