మియాపూర్ లో 550 ఎకరాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు

హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ వద్ద 550 ఎకరాల వివాదాస్పద భూములపై దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువడించింది. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికే చెందుతాయని పేర్కొంది. దీనిపై దాఖలైన పలు పిటీషన్లన్నింటినీ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో 2003 ఏప్రిల్ 16న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఫలితంగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్టయింది.

మియాపూర్ జాతీయ రహదారి 65కు ఇరువైపులా ఉన్న సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని ఈ భూముల విలువ దాదాపు రూ. 25,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 550 ఎకరాలు క్రమంగా కబ్జాకు గురవుతూ వచ్చాయి. అందులో బహుళ అంతస్తుల భవనాలు, నివాస సముదాయాలు, కట్టడాలు సైతం వెలిశాయి. హైదరాబాద్ మెట్రో రైల్ మియాపూర్ డిపో కూడా ఇదే స్థలంలో నిర్మితమైంది. ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. నివాస సముదాయాల యజమానులకు నోటీసులను పంపింది.

Supreme Court Upholds Telangana Governments Ownership of 550 Acres in Miyapur Survey Land

దీనిపై 23 సంవత్సరాలుగా న్యాయపోరాటం సాగుతూ వచ్చింది. ఈ స్థలం అంతా కూడా ప్రభుత్వానికి చెందుతుందంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూకబ్జా నిరోధక ప్రత్యేక కోర్టు, హైకోర్టు గతంలో తీర్పులు ఇచ్చాయి. అయినప్పటికీ.. యజమానులు వాటిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పీల్ కు వెళ్లారు. వీటిపై వాదోపవాదాలను ఆలకించిన అనంతరం తుది తీర్పు వెలువడించింది సుప్రీంకోర్టు బెంచ్. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం సమర్థించింది.

వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?
వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?

ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను ఆక్రమించేందుకు ప్రైవేట్ వ్యక్తులు పక్కా ప్రణాళికతో యత్నించారని ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. 1912 నాటి సర్వే రికార్డుల ప్రకారం ఈ భూములు సర్కారీ పోరంబోకుగా నమోదయ్యాయని గుర్తుచేసింది. 1949లో అమలులోకి వచ్చిన జాగీర్ల రద్దు చట్టం ప్రకారం ఈ స్థలంపై ఉన్న పాత హక్కులన్నీ పూర్తిగా రద్దయి ప్రభుత్వంలో విలీనమయ్యాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో భవనాల నిర్మాణంలో ఆ వాటర్ మాత్రమే వాడాలి: రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ లో భవనాల నిర్మాణంలో ఆ వాటర్ మాత్రమే వాడాలి: రేవంత్ రెడ్డి ఆదేశాలు

1950వ దశకంలో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సృష్టించిన పహాణీలు, నకిలీ పత్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. 1918లో వేలంలో ఈ భూమిని కొనుగోలు చేశామని, 1929 నిజాం ఫర్మాన్ ద్వారా తమ పూర్వీకులకు హక్కులు వచ్చాయని పిటిషనర్లు సుప్రీంకోర్టులో మొదటిసారి కొత్త వాదనను లేవనెత్తారు. దీనికి చట్టబద్ధత లేదని, శతాబ్ద కాలంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారిక రికార్డులకు ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం తోసిపుచ్చింది.

తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం

ఈ చారిత్రాత్మక తీర్పుపై ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భూములను రక్షించడానికి న్యాయపరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం వల్లే 23 ఏళ్ల నాటి మియాపూర్ కేసు త్వరితగతిన పరిష్కారమైందని తెలిపింది. 1997లో భూకబ్జా ప్రత్యేక కోర్టు, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించడంతో రూ. 25,000 కోట్ల విలువైన విలువైన ఆస్తి ప్రభుత్వానికి దక్కినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+