బాబు కుటుంబాన్ని చంపుతామనడం సరికాదు
హైదరాబాద్: హిందువులకు వామపక్షాలు వ్యతిరేకమని ఆరెస్సెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏవోబీ సరిహద్దుల్లో జరిగినవి ఎదురుకాల్పులు కాదని అన్నారు. అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలని సురవరం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని చంపుతామనడం సరికాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications