సర్వేలన్నీ హస్తం వైపే.. జూబ్లీహిల్స్‌లో గెలుపు లాంఛనమే!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు హస్తం వైపే మొగ్గు చూపడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన తేల్చిచెప్పారు.

ఇంటింటి ప్రచారంలో మంత్రులు
జూబ్లీహిల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం యూసుఫ్‌గూడ డివిజన్‌లోని కృష్ణానగర్‌లో తన సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే ఇదూలపల్లి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నేత అజారుద్దీన్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Surveys Favor Congress Minister Uttamkumar Reddy Confident of Jubilee Hills Victory

బీఆర్ఎస్ నిర్లక్ష్యంపై విమర్శలు:
ఈ సందర్బంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రేషన్ కార్డుల మంజూరు: కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 89 లక్షల నుండి కోటి 15 లక్షలకు పెరిగిందని, ఇంత పెద్ద ఎత్తున కార్డులు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని ఆయన అన్నారు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకే 40 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

యావత్ భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా నిరుపేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో సహా రాష్ట్ర జనాభాలోని 85 శాతం మందికి సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ నాణ్యమైన సన్న బియ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 15 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయోజనం కలుగుతుండగా.. గృహ జ్యోతి పథకంతో అర్హులైన నిరుపేదలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విపక్షాలపై విమర్శలు.. పొన్నం ప్రభాకర్ ప్రశ్న
ఇటువంటి సంక్షేమ పథకాలను విస్మరించిన విపక్షాలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం కుదిరిందని, ఆ నమ్మకంతోనే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల కుట్రలను ఛేదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని వివరించారు. కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+