ప్రియుడు రాజేష్ డిశ్చార్జ్‌పై నేడు నిర్ణయం: 'స్వాతి చంపమన్నదా, చంపేశారా'
హైదరాబాద్: సుధాకర్ రెడ్డిని చంపిన హత్య కేసులో స్వాతి ప్రియుడు రాజేష్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అంశంపై బుధవారం మధ్యాహ్నం వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. రాజేష్ ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాజేష్‌ను ఆసుపత్రి నుంచి డీశ్చార్జ్ చేస్తే నాగర్ కర్నూలు పోలీసులు ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలంటే అతనిపై గాయాలు ఉండకూడదు. జైలులోకి కూడా అనుమతించరు. ఈ నేపథ్యంలో రాజేష్ ఆరోగ్యం పూర్తిగా ఓకే అయ్యాకే డిశ్చార్జ్ చేయనున్నారు.

రాజేష్‌ను ప్రశ్నించేందుకు ప్రశ్నలు సిద్ధం
మధ్యాహ్నం రాజేష్ డిశ్చార్జ్ అయితే కనుక పోలీసులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకుంటారు. సుధాకర్ రెడ్డి హత్యపై మరిన్ని అంశాలు ఆయన నుంచి కూపీ లాగనున్నారు. రాజేష్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు ఇప్పటికే క్వశ్చనీర్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారు స్వాతిని విచారించారు.

స్వాతి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు
రాజేష్ ఆరోగ్యం మెరుగుపడితే ఆయనను అదుపులోకి తీసుకొని విచారించి, ఆ తర్వాత కోర్టు ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. స్వాతి ఇచ్చిన సమాచారంగా కూడా ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. స్వాతి చెప్పిన సమాధానాలు, రాజేష్ చెప్పే సమాధానాలను పోల్చుకోనున్నారు.

స్వాతి చంపమందా, మీకే ఆలోచన వచ్చిందా?
సుధాకర్ రెడ్డిని హత్య చేసిన రోజు వారి ఇంటికి ఎందుకు వెళ్లావు, ముందే హత్య చేయాలని నిర్ణయించుకున్నారా, ఆ రోజు కూడా గొడవ జరిగిందా, స్వాతి చంపమని చెప్పిందా, లేక ఆ ఆలోచన మీకే వచ్చిందా, గతంలో సుధాకర్ రెడ్డితో గొడవ పడ్డారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు.

స్వాతిని ఛీకొడుతున్న ఫ్యామిలీ
అలాగే, మీ ముఖంపై ఉన్న గాయాలు ఏమిటని, అవి ఎందుకు అయ్యాయని రాజేష్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. ప్రియుడు రాజేష్‌తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి చంపడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఛీ కొడుతున్నారు. ఆమె సోదరుడు, తండ్రి కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. స్వాతి ఇలాంటిది అనుకోలేదని చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications