T BJP మలి విడత జాబితా సిద్దం - లిస్టులో ఉన్నదెవరు..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం రోజు రోజుకీ హీటెక్కుతోంది. మూడు ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటకే సీఎం కేసీఆర్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణలో వరుస పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీల నుంచి పోటీలో ఉండే అభ్యర్దులు దాదాపు ఫైనల్ అయ్యారు. ఇటు బీజేపీ ఇప్పటికే ఒక జాబితా విడుదల చేయగా, రెండో జాబితాల పైన కసరత్తు తుది దశకు చేరుకుంది. దీంతో, ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది.
అభ్యర్దుల ఎంపిక : బీజేపీ మూడో జాబితా పైన పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరిని ఎక్కడ నుంచి బరిలోకి దింపాలనే అంశం పైన చర్చ చేసారు. గ్రేటర్ హైదరాబాద్ లో సీట్ల పైన ఈ సారి బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉండటంతో..ఈ ఎంపికలో ఆయన అభిప్రాయాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి విక్రమ్ గౌడ్, ముషీరాబాద్ నుంచి గోపాల్ రెడ్డి లేదా బండారు విజయలక్ష్మికి ఇచ్చే అవకాశం ఉంది. అంబర్ పేట నుంచి బండారు విజయలక్ష్మి లేదా గౌతమ్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

బీజేపీ నేతల కసరత్తు : సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆకుల రాజేందర్, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి అభ్యర్దిత్వాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, వంగా మధుసూధన్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు, ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటుగా వీరేందర్ గౌడ్ సీటు ఆశిస్తున్నారు. మేడ్చల్ నుంచి విక్రమ్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాలు ఫైనల్ కావటంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని వారు ప్రస్తుతం బీజేపీతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వారి బలాబాలాలను పరిశీలించి వారి పేర్లను సీట్ల ఖరారు సమయంలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మూడో జాబితాలో ఛాన్స్ కోసం : దీంతో, నవంబర్ 1 లేదా 2న బీజేపీ తెలంగాణ అభ్యర్దుల జాబితా 40 మంది పేర్లతో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పది నియోజకవర్గాల్లో ఎంపిక ఆలస్యం అవుతోందని సమాచారం. సర్వే నివేదికలు...సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక కసరత్తు కొనసాగుతోందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి తమ పార్టీలోకి తీసుకెళ్లేందుకు అటు వైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. నవంబర్ 5వ తేదీ నాటికి పూర్తిగా అభ్యర్దులను ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో, మూడు ప్రధాన పార్టీల అభ్యర్దులు ఎవరనేది స్పష్టత రావటం ద్వారా..ఇక ప్రచారం హోర ఊపందుకోనుంది.












Click it and Unblock the Notifications