అంతా నీవల్లే.. రేవంత్ వల్లే టీడీపీకి ఈ గతి : మాధవరం కృష్ణారావు
తెలంగాణలో టీడీపీ ఆచూకీ లేకుండా పోవడానికి గల అసలు కారణమేంటో బయటపెట్టారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. టీడీపీఎల్పీ నేత రేవంత్ రెడ్ది స్వార్థ రాజకీయాల వల్లే తెలంగాణలో టీడీపీ నామారూపాలు లేకుండా పోయిందని ఆరోపించారాయన. తన నియోజకవర్గం కూకట్ పల్లి పరిధిలో మీడీయాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మాధవరం. టీడీపీ తరుపున గెలిచిన మాధవరం టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
తనకు కేంద్ర భద్రత కావాలని డిమాండ్ చేస్తున్న రేవంత్ కి అసలు ప్రత్యేక భద్రత ఏది అవసరం లేదన్నారు మాధవరం కృష్ణారావు. సొంత ప్రయోజనాల కోసం రేవంత్ ప్రజలను పావుల్లా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం రేవంత్ కి బాగా తెలిసిన విద్య అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అదే పార్టీతో కలిసి పని చేయడమేంటని ప్రశ్నించారు. మరి మాధవరం వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్ది స్పందనేంటో..!













Click it and Unblock the Notifications