బాబు వస్తే స్వాగతిస్తాం, మా పార్టీలో చేరాలి: కవిత
నిజామాబాద్: పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి వచ్చినా, నిజామాబాదుకు వచ్చినా సాదరంగా స్వాగతిస్తామని నిజామాబాద్ తెరాస పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు. నిజామాబాదు జిల్లాలో ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఎన్నడు లేని విధంగా పెద్దపల్లి రైల్వే లైనుకు ఈసారి రూ.141 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఆర్ అండ్ బీ పనులకు రూ.1,028 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఇక్కడి నేతలు పక్క రాష్ట్రాల జెండాలు మోయవద్దని ఆమె తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చెప్పారు.
పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. పచ్చ పార్టీల నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో కలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలే కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications