టిఆర్ఎస్‌లో చేరికకు టిడిపి ఎమ్మెల్యే షరతులు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు తెలుగుదేశం పార్టీ రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ షరతులు పెడుతున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.350 కోట్ల నిధులతో పాటు ఇంటింటికీ మంజీరా నీటి సరఫరా చేస్తే తాను తప్పకుండా టిఆర్ఎస్‌లో చేరుతానని ఆయన అన్నారు.

హైదరాబాదు సమీపంలోని గండిపేటలో ఆయన ఆదివారంనాడు పతంగుల ఉత్సవా్ని ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి కెసిఆర్ తనను పిలిచారని, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను అందించానని ఆయన చెప్పారు. అవి చేపడితే తప్పకుండా తాను టిఆర్ఎస్‌లో చేరుతానని అన్నారు.

TDP MLA Prakash Goud bargains to join TRS

మూడు నెలలు గడిచినా మంజీరా నీరు, అభివృద్ధి పనుల విషయంలో ఏ విధమైన కదలిక లేనప్పుడు తాను పారటీ మారి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గం పరధిలోని నాలుగు డివిజన్లకు రూ.200 కోట్లు, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు రూ. 150 కోట్ల నిధులు అడిగినట్లు ఆయన తెలిపారు.

నియోజకవర్గం ప్రజలు తనను గెలిపించారని, వారి ప్రయోజనం చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ అబివృద్ధి, పేదల సంక్షేమానికి కృషి చేసి, ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన అన్నారు. అందుకే ప్రజల్లో వారికి మంచి పేరు ఉందని కితాబు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+