రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?

Posted By:
Subscribe to Oneindia Telugu
Revanth Reddy Issue : నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్ | Oneindia Telugu

హైదరాబాద్: అక్టోబర్ 28న, అమరావతిలో జరిగే టిడిపి తెలంగాణ ముఖ్య నేతల సమావేశానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హజరుకానున్నారు. ఈ సమావేశంలో తన అభిప్రాయాలను మరోసారి బాబు వద్ద విన్పించే అవకాశం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎ
స్‌తో పొత్తు ఉండదని చంద్రబాబునాయుడు స్పష్టత ఇస్తే రేవంత్‌ వైఖరిలో మార్పు ఉంటుందా అనే విషయమై కూడ చర్చ సాగుతోంది.

ట్విస్ట్: నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో శుక్రవారం నాడు టిడిపి ముఖ్యులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.

'రేవంత్‌‌పై బాబుదే తుది నిర్ణయం, తప్పు చేశానని నిరూపిస్తే తప్పుకొంటా'

ఈ సమావేశానికి కొనసాగింపుగానే రేపు అమరావతిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరుకావాలని చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డి హజరయ్యేందుకు నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనం

ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

రేవంత్‌ ఎపిసోడ్‌పై కీలక సమావేశం

రేవంత్‌ ఎపిసోడ్‌పై కీలక సమావేశం

అక్టోబర్ 28న, అమరావతిలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై టిడిపి ముఖ్య నేతల సమావేశం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై చర్చించనున్నారు.రేవంత్‌రెడ్డి విషయమై రేపటి సమావేశం లో చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.

విడివిడిగా నేతలతో బాబు సమావేశం

విడివిడిగా నేతలతో బాబు సమావేశం

పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది. శుక్రవారంనాడు లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో జరిగిన సమావేశంలో కూడ కొందరు నేతలు ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో అందరిముందు అభిప్రాయాలు వెల్లడించడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావించింది. దీంతో ముఖాముఖి సమావేశంలో తమ అభిప్రాయాలను నేతలు నిర్మోహమాటంగా వెల్లడించే అవకాశం ఉంది. ముఖాముఖి సమావేశంలో రేవంత్‌పై ముఖ్య నేతలు తమ అభిప్రాయాలను బాబు వద్ద ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. దీంతో బాబుకు కూడ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు.

టిఆర్ఎస్‌తో పొత్తు విషయమై స్పష్టత కోరనున్న రేవంత్

టిఆర్ఎస్‌తో పొత్తు విషయమై స్పష్టత కోరనున్న రేవంత్

2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు విషయమై రేవంత్‌రెడ్డి రేపటి సమావేశంలో స్పష్టత కోరే అవకాశం కన్పిస్తోంది. టిఆర్ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టత ఇవ్వాలని రేవంత్ బాబు వద్ద మెలిక పెట్టే అవకాశం లేకపోలేదు. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు విషయమై కూడ రేవంత్ ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఈ రెండు అంశాలపై రేవంత్‌రెడ్డి బాబు వద్ద మెలికలు పెట్టే అవకాశం ఉంది.ఈ విషయమై స్పష్టత లేకపోతే రేవంత్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

బాబు ఏం చేయనున్నారు?

బాబు ఏం చేయనున్నారు?

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌లో పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశంలో నేతల అభిప్రాయాలు తీసుకొన్న చంద్రబాబునాయుడు పార్టీన బలోపేతం చేసేందుకు ఏ నిర్ణయం అమలు చేస్తే ప్రయోజనంగా ఉంటుందనే విషయమై బేరీజు వేసుకొంటారు.ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలున్నాయి. అయితే అదే సమయంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొనేందుకు కూడ వెనుకాడబోమనే సంకేతాలు ఇచ్చే అవకాశాలు కూడ ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp MLA Revanth Reddy will attend TTDP leaders meeting on Oct 28 at Amaravati. Chandrababunaidu will take leaders opinion one to one.
Please Wait while comments are loading...