ఆ కుట్రలో భాగంగానే, చుక్కలు చూపిస్తాడు: రేవంత్‌పై దుమ్మెత్తిపోశారు

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించడంపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. రాజకీయ అవసరాల కోసమే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించడంపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. రాజకీయ అవసరాల కోసమే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు.

మంగళవారం హన్మకొండలోని బీజేపీ అర్బన్ జిల్లా కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. కాంగ్రెస్.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాదని, అవినీతికి మారుపేరు అని ఎద్దేవా చేశారు.

 రేవంత్ రెడ్డి అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు

రేవంత్ రెడ్డి అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని చెప్పిన రేవంత్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పల్లకి మోస్తున్నాడని రాకేష్ విమర్శించారు. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు.

 అందుకే తెలంగాణ ఉద్యమం

అందుకే తెలంగాణ ఉద్యమం

ప్రధాని మోడీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదని రాకేష్ అన్నారు. కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ తప్పిదాల వల్లనే తెలంగాణ ఉద్యమం మొదలైందని, తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేయడం వల్లనే తెలంగాణ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

 రేవంత్ వెళ్లిపోతే ఎలాంటి నష్టం లేదు

రేవంత్ వెళ్లిపోతే ఎలాంటి నష్టం లేదు

పార్టీని రేవంత్‌రెడ్డి వీడిన కారణంగా టీడీపీ తెలంగాణ శాఖకు ఇంతకాలం పట్టిన గ్రహణం వీడిపోయినట్లయిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ మంగళవారం పునరుద్ఘాటించారు. ఆయన వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు.

ఆ కుట్రలో భాగంగానే, కాంగ్రెస్‌కూ అదేగతి

ఆ కుట్రలో భాగంగానే, కాంగ్రెస్‌కూ అదేగతి

రేవంత్ సీమాంధ్ర ఏజెంటు అని, చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణను విచ్చిన్నం చేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్‌లో చేరారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రేవంత్‌ కాంగ్రెస్‌కు చివరికి టీడీపీ గతే పట్టిస్తారని పేర్కొన్నారు.

రేవంత్ తెలంగాణకు బద్ద వ్యతిరేకి, చుక్కలు చూపిస్తాడు

రేవంత్ తెలంగాణకు బద్ద వ్యతిరేకి, చుక్కలు చూపిస్తాడు

ఉప ఎన్నికలు వస్తే గతంలోని ఫలితాలే పునరావృతం టీఆర్ఎస్ నేతలు అన్నారు. రేవంత్‌ జిత్తుల మారి అని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడి చివరికి చుక్కలు చూపిస్తారని విమర్శించారు. తెలంగాణకు రేవంత్‌ బద్ధవ్యతిరేకి అని, చంద్రబాబు దర్శకత్వంలో ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుకునే పథకంలో భాగస్వామి అయ్యారన్నారు.

ఎన్టీఆర్ పౌరుషం ఏది

ఎన్టీఆర్ పౌరుషం ఏది

ఎన్టీఆర్‌ పౌరుషం అని పదేపదే చెబుతున్న రేవంత్‌ ఇప్పుడు ఆయన వ్యతిరేకించే పార్టీలో చేరడం సిగ్గుచేటు అని మంత్రి జూపల్లి అన్నారు. సోనియాను బలిదేవత అని గతంలో దూషించి, ఇప్పుడు ఆమె కుమారుడు రాహుల్‌ వద్దకు వెళ్లి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు.

ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాం

ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాం

రేవంత్‌ రెడ్డి పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతారని జూపల్లి అన్నారు. కొడంగల్‌ ప్రజలను మోసం చేసిన ఆయనకు ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. కులవృత్తుల వారిపై ఆయన అహంకారంతో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+