హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండేళ్లుగా ఫ్లిప్‌కార్ట్‌కు టోకరా: హైదరాబాద్ టెక్కీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత రెండేళ్లుగా ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేస్తున్న పాతికేళ్ల కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లిప్‌కార్టును అతను అత్యంత చాకచక్యంగా మోసం చేస్తూ వచ్చాడు. పి. రఘువీరా రెడ్డి అనే టెక్కీ ఎలక్ట్రానిక్ పరికారలకు ఆర్డర్ ఇచ్చి, అవి వచ్చిన తర్వాత బాగా పనిచేయడం లేదని తిరిగి పంపుతూ వచ్చాడు.

వాటిని వెనక్కి పంపడానికి ముదు ముఖ్యమైన హార్డ్‌వేర్ విడిభాగాలను తీసేయడమో, వాటిని డుప్లికేట్ పరికరాలతో మార్చడమో చేస్తూ వచ్చాడు. గత వారం రఘువీరా రెడ్డి మూడు కంప్యూటర్లకు ఆర్డర్ ఇచ్చాడు. సరిగా పనిచేయడం లేదంటూ వాటిని ఫ్లిప్‌కార్ట్‌కు తిరిగి పంపించాడు.

Techie booked for cheating Flipkart

దాంతో తిరిగి వచ్చిన కంప్యూటర్లను అధికారులు చెక్ చేశారు. విలువైన చిప్స్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్ విభాగాలు మాయమైనట్లు గుర్తించారు. వాటితో పాటు ఫ్లిప్‌కార్టుకు ఆర్డరచ్చి తెప్పించుకున్న కెమెరాలు, ఇతతర పరికరాల విలువైన హార్డ్‌వేర్ విడిభాగాలను కూడా అతను దొంగలించాడు.

పరికరాలు డెలివరీ అయిన రెండు మూడు రోజులకు వాటిని రఘువీరా రెడ్డి తిరిగి పంపుతూ వచ్చాడు. గత రెండేళ్లుగా అతను ఇదే పని చేస్తూ వస్తున్నాడని వనస్థలిపురం పోలీసు ఇన్‌స్పెక్టర్ బి. పుష్పం కుమార్ చెప్పారు.

English summary
A 25-year-old computer hardware engineer has been booked for cheating e-tailing giant Flipkart for the last two years.P. Raghuveera Reddy would order electronic goods and later return the same stating that they were not working.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X