తీన్మార్ మల్లన్న బెయిల్ పై రాగానే మళ్ళీ అరెస్ట్; ఈసారి ఇంకో షాకింగ్ కేసులో మళ్ళీ చంచల్ గూడా జైలుకు !!
తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న తీన్మార్ మల్లన్నను తెలంగాణ ప్రభుత్వం వదిలిపెట్టేలా కనిపించటం లేదు. ఇప్పటికే ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేశాడని, ముప్పై లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలపై తీన్మార్ మల్లన్న అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించిన తెలంగాణా సర్కార్ మల్లన్నపై మరో కేసు పెట్టింది. ఇక తాజాగా నిన్న బెయిల్ పై బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్న ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మల్లన్న మళ్ళీ అరెస్ట్ ... చంచల్ గూడా జైలుకు మరోమారు రిమాండ్ ఖైదీగా
ఇక తాజాగా తీన్మార్ మల్లన్నను మరో కేసు పై అరెస్టు చేసిన పోలీసులు ఆయన అరెస్టుకు గల కారణాలను వెల్లడించారు. తాజాగా నిజామాబాద్ లో ఒక కల్లు వ్యాపారి వద్ద మల్లన్న టీం డబ్బులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలపై మల్లన్నతో పాటుగా ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న బెయిల్ పై బయటకు వచ్చిన మల్లన్నను మళ్ళీ అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో మల్లన్నకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మళ్లీ మల్లన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు.

తెలంగాణా ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తీన్మార్ మల్లన్న
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కేటీఆర్ కుటుంబ పాలనను, కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అక్రమాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళుతూ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న కేసీఆర్ సర్కార్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఎన్నికల బరిలోకి దిగిన ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై కొంతమేర ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో తీన్మార్ మల్లన్న ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం తెలంగాణ సర్కారుకు ఏమాత్రం రుచించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న తెలంగాణా ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

వరుస కేసులు పెడుతూ తీన్మార్ మల్లన్న కు చుక్కలు
ఇదే సమయంలో తీన్మార్ మల్లన్న పై బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో తెలంగాణ సర్కార్ మల్లన్నను తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఒకదానిపై ఒకటి వరుస కేసులు పెడుతూ తీన్మార్ మల్లన్న కు చుక్కలు చూపిస్తుంది. తీన్మార్ మల్లన్న అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను విడుదల చేయాలంటూ ఆయన అనుచరుల నుండి , రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తల నుండి డిమాండ్ వినిపిస్తోంది. తీన్మార్ మల్లన్నను మళ్ళీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్రమ అరెస్ట్ అంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వ ,మంత్రుల అవినీతి ని వెలికితీసేందుకు తీన్మార్ మల్లన్న పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

మల్లన్న ను పర్మినెంట్ గా జైల్లో ఉంచే కుట్ర జరుగుతుందంటూ మల్లన్న టీం ఆందోళన
తక్షణం తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు . తీన్మార్ మల్లన్న కోసం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు . మల్లన్నను రిలీజ్ చెయ్యాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన గళం వినిపిస్తే వారిని అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం మల్లన్న అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను పర్మినెంట్ గా జైల్లో ఉంచే కుట్ర జరుగుతుందని వారంటున్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని, ప్రశ్నించే గొంతు నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తీన్మార్ మల్లన్న టీమ్ ఆరోపిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications