తెలుగు సినీ ఇండస్ట్రీకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్
తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చివరి హెచ్చరిక జారీచేసిందా? అనే ప్రశ్నకు రాజకీయ, సినీ విశ్లేషకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. నాగార్జున-కొండా సురేఖ విషయంలో టాలీవుడ్ అతిగా స్పందించిందని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టాలీవుడ్ కు చెందినవారు మాత్రం తమ విమర్శల దాడిని కొనసాగించారు. మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా హెచ్చరిక చేయకుండా వినమ్రంగా అడగడం కూడా అలుసైపోయిందనే భావన వ్యక్తమవుతోంది.
రెండురోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో కొండా సురేఖపై ఎవరు ఒక్క మాట మాట్లాడినా ఆమె మాత్రం ఒంటరి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేశారు. రాజకీయ, సినీ విశ్లేషకులు మాత్రం ఇది పార్టీ తరఫున హెచ్చరిక కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, రేవంత్ రెడ్డి తరఫున లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని భావించాల్సి ఉంటుందన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించినప్పటికీ, సమంతకు క్షమాపణలు చెప్పినప్పటికీ టాలీవుడ్ పెద్దలు ఆగలేదు. విమర్శల దాడిని కొనసాగించారు.

ఇలా వివాదం కొనసాగుతున్న తరుణంలోనే అక్కినేని నాగార్జునపై కబ్జా కేసు నమోదైంది. నాగార్జు నుంచి డబ్బులు వసూలుచేయాలని, ఎన్ కన్వెన్షన్ నిర్మించినప్పటి నుంచి సంపాదించిన సొమ్మంతా వసూలు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి కోరుతున్నారు. ఈ కేసు నాగార్జునపై నమోదైన తర్వాత పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. టాలీవుడ్ కు ఈ ఎపిసోడ్ మొత్తంలో సూక్ష్మం అర్థమైవుంటుందని భావిస్తున్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులు చాలామంది గతంలో బీఆర్ఎస్ నేతలతో అంటకాగారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. వారినుంచి వస్తున్న విమర్శలు టాలీవుడ్ నుంచి వస్తున్నట్లుగా కాకుండా నేరుగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ వివాదాన్ని ఇంతటితో ముగించడానికి టీలీవుడ్ కు ఓ 'స్పష్టత' ఇచ్చింది.












Click it and Unblock the Notifications