Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెకెండ్ వేవ్ దెబ్బ..గట్టిగా: తెలంగాణలో 20 వేలకు పైగా: సింగిల్ డేలో 3,000 ప్లస్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధ:గా కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. హడలెత్తిస్తోన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ దెబ్బ గట్టిగా పడుతోంది. కొత్తగా రోజువారీ కేసుల సంఖ్య మూడువేలను దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం చాలా తక్కువ సందర్భాల్లోనే చోటుచేసుకుంది. యాక్టివ్ కేసులు 20 వేల మార్క్‌ను దాటేశాయి. కరోనా పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయనేది దీనితో స్పష్టమౌతోంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,187 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుమంది మరణించారు. 787 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,27,279కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,05,335 మంది ఉన్నారు. 1,759 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. తాజా బులెటిన్ ప్రకారం.. 20,184 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 13,366 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Telangana: 3187 Covid19 positive cases and and 7 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 551 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు పలు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 333 కొత్త కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో డబుల్ సెంచరీ దాటాయి. ఆదిలాబాద్-92, భద్రాద్రి కొత్తగూడెం-37, జగిత్యాల-134, జనగామ-20, జయశంకర్ భూపాలపల్లి-17, జోగుళాంబ గద్వాల-14, కామారెడ్డి-113, కరీంనగర్-104, ఖమ్మం-79, కొమరం భీమ్ ఆసిఫాబాద్-35, మహబూబ్‌నగర్-73, మహబూబాబాద్-18, మంచిర్యాల-59, మెదక్-53, మేడ్చల్ మల్కాజ్‌గిరి-333, ములుగు-13, నాగర్ కర్నూల్-35, నల్లగొండ-83, నారాయణ్‌పేట్-10, నిర్మల్-154, నిజామాబాద్-251, పెద్దపల్లి-29, రాజన్న సిరిసిల్ల-57, రంగారెడ్డి-271, సంగారెడ్డి-104, సిద్ధిపేట్-81, సూర్యాపేట్-55, వికారాబాాద్-68, వనపర్తి-59, వరంగల్ రూరల్-27, వరంగల్ అర్బన్-98, యాదాద్రి భువనగిరి-60 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    #Coronavirusinindia : PM Modi Gets Second Vaccine Dose ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ !!

    తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 1,15,311 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 48.5 శాతం కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,09,88,976గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,95,243 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+