• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ-తెలంగాణలు వెనుకబడ్డాయి: బాబు-కేసీఆర్‌లకు ఎన్సీఏఈఆర్ షాక్

By Srinivas
|

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలకు షాక్! పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వెనుకబడ్డాయి. నేషనల్ కౌన్సెల్ ఫర్ అప్లై‌డ్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ 2018 (ఎన్సీఏఈఆర్) ప్రకారం ఈ రెండు రాష్ట్రాలు ర్యాంకులు ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి. ఎన్సీఏఈఆర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే, తెలంగాణ 8వ స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ 2017లో మూడో ర్యాంకులో ఉండగా, ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి ఏడో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ కూడా బాగా కిందకుపోయింది. సమాచారం మేరకు.. లా ఆండ్ ఆర్డర్ కారణంగానే పెట్టుబడుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కిందకు జారాయని అంటున్నారు. నాలుగు కేటగిరీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఒక్కో కేటగిరీలో ముందుండటం గమనార్హం.

వీటి ఆధారంగా జాబితా విడుదల

వీటి ఆధారంగా జాబితా విడుదల

వివిధ అంశాల ఆధారంగా దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాలను గుర్తించి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈవోడీబీ ర్యాంకింగ్స్ విషయంలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఏపీ, తెలంగాణలు ఎన్సీఏఈఆర్ జాబితాలో మాత్రం ఏడు, ఎనిమిదవ స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర పెట్టుబడి పొటెన్షియల్ ఇండెక్స్ (ఎన్-ఎస్ఐపిఐ) పేరుతో తాజాగా ఎన్ సీఏఈఆర్ ఈ జాబితాను విడుదల చేసింది. భూమి, కార్మికులు, మౌలికసదుపాయాలు, ఆర్థిక వాతావరణం, రాజకీయ స్థిరత్వం, పరిపాలన వంటి కీలక అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

 మొదటి స్థానంలో ఢిల్లీ

మొదటి స్థానంలో ఢిల్లీ

ఈ సర్వే ప్రభావం పారిశ్రామిక రంగంపై ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు రెండో స్థానానికి ఎగబాకింది. జాబితాలో గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. హర్యానా నాలుగు, మహారాష్ట్ర అయిదు, కేరళ ఆరు, ఏపీ ఏడు, తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. కర్ణాటక తొమ్మిది, పశ్చిమ బెంగాల్ పదో స్థానంతో సరిపెట్టుకున్నాయి.

ఎంతమంది నుంచి అభిప్రాయ సేకరణ అంటే

ఎంతమంది నుంచి అభిప్రాయ సేకరణ అంటే

పారిశ్రామికవేత్తల అభిప్రాయాల పరంగా చూస్తే ఏపీ, తెలంగాణల పరిస్థితి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భూమి పొందే/అందుబాటు జాబితాలో తెలంగాణలో పరిస్థితి అనుకూలంగానే ఉందని ఈ నివేదిక చెబుతోంది. మానుఫ్యాక్చరింగ్, సెర్వీస్ సెక్టార్‌లలో ఉన్న వివిధ 1049 బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్‌ల నుంచి సేకరించారు. చాలా రాష్ట్రాలు వెనుకబడటానికి లా అండ్ ఆర్డర్ కారణమని చెబుతున్నారు.

అంశాల వారీగా చూస్తే

అంశాల వారీగా చూస్తే

ఒక్కో అంశం పరంగా చూస్తే భూమి ల్యాండ్ పిల్లర్ విషయంలో తెలంగాణ ముందుంది. లేబర్ పిల్లర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందుంది. ఎకనామిక్ క్లైమేట్ పరంగా చూస్తే ఢిల్లీ ముందంజలో ఉంది. కాగా, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఒకింత ముందుండటం ఇది రెండోసారి. ఎన్సీఏఈఆర్ సర్వే చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలకు షాక్ అని చెప్పవచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని telangana వార్తలుView All

English summary
Telangana and Andhra Pradesh, both lose in investment attractiveness. The two Telugu speaking states have shown a decline in investor interest, according to a report issued by India’s think-tank, the National Council for Applied and Economic Research (NCAER) in its 2018 State Investment Potential Indices. The NCAER positions AP as the 7th best state for investors, while Telangana stands at 8th place.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more