గవర్నర్ తో మంత్రుల సమావేశం, విభజన సమస్యలే ఎజెండా

రెండు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకుగాను ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు.

హైదరాబాద్ :తెలంగాణ, ఆం ధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకుగాను రెండు రాష్ట్రాల మంత్రులు గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో సమావేశమయ్యారు.

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి.అయితే ఈ సమస్యలపై రెండు రాష్ట్రాల మంత్రులు కమిటీ ఈ నెల 1వ, తేదిన సమావేశమైంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు.

దీంతో గురువారం నాడు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు మరోసారి రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో చర్చించారు.

telangana and andhra pradesh ministers meeting with governor

రెండు రాష్ట్రాల మద్య ఉద్యోగుల విభజన అంశం ఇంకా పూర్తి కాలేదు. అదే విధంగా తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల విభజన అంశం కూడ అలానే ఉంది. దీనికితోడు భవనాల అప్పగింత అంశం కూడ పెండింగ్ లో ఉంది.వీటికి తోడు ఇంకా అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.

సమస్యలపై కోర్టులను ఆశ్రయించకుండా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సమావేశమై పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించాడు. ఈ మేరకు మంత్రుల కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు గురువారం మధ్చాహ్పం ఎపి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు , తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు రాజ్ భవన్ లో సమావేశమయ్యారు.

ఈ బేటీలో రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న అంశాలపై చర్చించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు సానుకూల వాతావరణంలోనే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+