బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో బీఏసీ సమావేశం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ కమిటీహాల్ లో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ప్రతిపక్షాలు కోరుకున్నన్ని రోజులు సమావేశాలు నిర్వహించడానికి, అన్నిఅంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగానే 20 పని దినాలపాటు శాసనసభ నిర్వహణకు బీఏసీ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications