Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్టోబర్ 19 న తెలంగాణా బంద్ ? .. ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చెయ్యాలని జేఏసీ నిర్ణయం

తెలంగాణ ఆర్టిసిని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేస్తున్నారు . కార్మికుల సమ్మె ను అణిచివేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం పై మండిపడుతున్నారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర బంద్ కు పిలుపు నివ్వనున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్మిక కుటుంబాల లో కెసిఆర్ తీసుకున్న నిర్ణయం విషాదం నింపింది. భార్య ఉద్యోగం పోయిందని భర్త, తన ఉద్యోగం పోయిందని మనస్తాపంతో ఒక ఆర్టీసీ డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు.

 సమ్మె ఉధృతం చెయ్యనున్న కార్మిక జేఏసీ

సమ్మె ఉధృతం చెయ్యనున్న కార్మిక జేఏసీ

ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాక పోవడంతో ఈ సమ్మెని మరింత ఉద్ధృతంగా చేయడానీకి ఆర్టీసీ కార్మికులు నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి. సబ్బండ వర్గాలను ఏకం చేసి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అక్టోబర్ 19న తెలంగాణా బంద్ కు పిలుపు

అక్టోబర్ 19న తెలంగాణా బంద్ కు పిలుపు

ఈమేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద వారి ఆందోళనని తీవ్రతరం చేయడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు కార్మికులు.
ఈమేరకు అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఈమేరకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే తెలంగాణలోని ప్రతిపక్షాలతో నేడు ఆర్టీసీ కార్మిక జేఏసీ మరొకసారి తమ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆ చర్చలను బట్టి ఆర్టీసీ కార్మికులు తలపెట్టనున్న బంద్ పై తమ చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.

నేడు ఆందోళన చేసిన మహిళా కార్మికులు

నేడు ఆందోళన చేసిన మహిళా కార్మికులు

ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారో అదేవిధంగా నేడు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ సర్కారు మెడలు వంచి న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేడు ఆరోరోజు సమ్మె సందర్భంగా మహిళా కార్మికులు డిపోల ముందు నిరసన తెలియజేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయంతో సగటు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 కుటుంబాలతో రోడ్డెక్కుతాం .. గద్దె దించుతామని హెచ్చరిక

కుటుంబాలతో రోడ్డెక్కుతాం .. గద్దె దించుతామని హెచ్చరిక

ఐదేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇచ్చి మరి ఆందోళన చేస్తే ఉద్యోగాలు తీసేస్తారా.. అదంతా సాధ్యం కాదు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి అధికారం ప్రజలు పెట్టిన బిక్ష.. ఆ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే చావు దెబ్బ తినడం ఖాయమని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే వరకు పోరాటాన్ని విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు. కుటుంబాలతో సహా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+