Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాల మధ్య బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం తను రాజీనామా చేసినట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ 2020లో బాధ్యతలు తీసుకున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలోనే బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మునుగోడులో కూడా బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే ముందుకెళ్లారు. గత కొద్ది రోజులుగా బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో సరిగా పాల్గొనకపోవడంతో వారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.బండి సంజయ్ ని త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ అధినాయకత్వం ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించారు.
బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వహించారు. 1994-2003 మధ్య ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా చేశారు. 2005 లో కరీంనగర్ 48వ డివిజన్ నుంచి బీజీపీ కార్పొరేటర్ విజయం సాధించాడు. ఆ తర్వాత కరీంనగర్ అసెంబ్లీకి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2019 కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు.












Click it and Unblock the Notifications