తెలంగాణ బీఎస్పీ సీఎం అభ్యర్థిని ప్రకటించిన మాయావతి: కేసీఆర్‌పై ఘాటు విమర్శలు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి(Mayawati). బీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ భరోసా సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాన్షీరామ్ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
Telangana Barosa Sabha by Bahujan Samaj Party (BSP) @SaroorNagar May 7, 2023. Grand Success 👍👌🌹 Everyone participated wid committment & compassion. Thankyou Behenji @Mayawati ji for declaring @RSPraveenSwaero garu as the CM candidate from BSP TS. @MaheshVarikunta @BITCELL_BSP pic.twitter.com/at9QbXZKMp
— Rajitha Komanduri (@RK4BSP) May 7, 2023
ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చినా.. ఇంకా ఆ వర్గాల చెంతకు అభివృద్ధి చేరలేదన్నారు మాయావతి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం మరిన్ని చట్టాలు తేవాలని న్యాయమంత్రిగా అంబేద్కర్ భావించారని.. ఆయన మాటలను అప్పటి ప్రధాని నెహ్రూ లక్ష్య పెట్టలేదన్నారు. జ్యోతిబాపూలే, అంబేద్కర్, నారాయణగురు చూపిన బాటలో పయనిద్దామని మాయావతి పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం కాదని, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. తెలంగాణలో పేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పి.. సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు మాయావతి.
అంబేద్కర్ పేరుతో కేసీఆర్ చేస్తున్న నాటకాలు బంద్ చేయాలని మాయావతి హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చుతానని కేసీఆర్ అన్నారని..అలాంటి వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు తీరుతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. బీహార్‌లో తెలంగాణ ఐఏఎస్ అధికారిని చంపిన గ్యాంగ్ స్టర్‌ను విడుదల చేస్తే.. కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మాయావతి మండిపడ్డారు.
తెలంగాణ బీయస్పీ శ్రేణులను నమ్మి,బీయస్పీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు ముగ్ధులై, రాబోయే బహుజనరాజ్యంలో ప్రవీణ్ కుమార్ అనే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించిన మా అధినేత్రి, ఉక్కు మహిళ గౌరవ బెహన్జీ, @Mayawati గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 7, 2023
🙏🙏🙏 pic.twitter.com/m1aZDjc729
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని మాయావతి అన్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చారని..అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్‌పై ప్రవీణ్ విమర్శలు
బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలని విమర్శించారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అకాల వర్షాలు కురిసి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతే సీఎం ప్రగతిభవన్ దాటలేదన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలు, మైనార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ.. బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, సరూర్ నగర్ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు కొత్తపేట నుంచి సరూర్‌నగర్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications