20న తెలంగాణ కేబినెట్ భేటీ: హైడ్రాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

సెప్టెంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

చెరువులు, నాలాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతోంది. ఈ సంస్థ ఎఫ్​‌టీఎల్‌​లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకొని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Telangana Cabinet Meeting will be held on September 20th

మరోవైపు, తెలంగాణలో రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. అయితే, రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో వారికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రైతుబంధు స్థానంలో రైతుభరోసాను పంట పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన అమలు, పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయాలు సేకరణ చేపట్టనుంది.

ప్రస్తుతం వానాకాలం పంట ముగింపు దశకు చేరుతున్న క్రమంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఈ మేరకు పంటలు వేసిన వారికే సాయం చేస్తామని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దీనిపై మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామాలు పట్టణాలు అనే తేడాలేకుండా వరద ప్రభావిత ప్రజలు ముంపుతో భారీగా నష్టపోయారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పరిశీలించింది. దీనిపై కేంద్రం ఉదారంగా సాయం చేయాలని మంత్రివర్గం తీర్మానం చేయనుంది.

పేద కుటుంబాలకు రేషన్‌ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్‌కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలను సులభంగా అందించడానికి ఆరోగ్య కార్డుల జారీకి ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది.

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కులగణనను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కులగణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలు మంత్రివర్గ భేటీలో ఆమోదించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+