సురేఖ సహా ముగ్గురు ఔట్: రాములమ్మ, మహేష్ గౌడ్ ఇన్- పీసీసీ చీఫ్, స్పీకర్ మార్పు..!?

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. కొండా సురేఖ వివాదం వేళ పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. అదే సమయంలో పీసీసీ చీఫ్, స్పీకర్ సైతం మారుతారని పార్టీ నేతల సమాచారం. ఈ ఇద్దరినీ రేవంత్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అదే విధంగా సురేఖతో పాటుగా మరో ఇద్దరు మంత్రుల పై వేటు పడనుందని తెలుస్తోంది. కొత్తగా మంత్రులు అయ్యే వారి పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. సెప్టెంబరు 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పీసీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం సూచించింది. మూడో తేదీన జరగనున్న చర్చల్లో కొండా సురేఖ వ్యవహారంతోపాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేయనున్నారు. కొండా సురేఖ వివాదానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. దీంతో, ఢిల్లీ పర్యటన తరువాత మంత్రివర్గం ప్రక్షాళన ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సురేఖ తో గతంలో వివాదాస్పదంగా వ్యవహరించి.. సీఎం ఆగ్రహానికి గురైన మంత్రితో పాటుగా.. మరో మంత్రిపైనా వేటు ఖాయమని చెబుతున్నారు. వారి స్థానంలో ముగ్గురు కొత్తగా కేబినెట్ లో ఛాన్స్ దక్కనుంది. సురేఖ స్థానంలో ఎమ్మెల్సీ విజయ శాంతి పేరు ఖాయమైనట్లు సమాచారం.

 సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!
సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!
telangana-cabinet-reshuffle-in-next-week-as-aicc-latest-decisions-big-changes-in-present-cm-revant

ఢిల్లీకి సీఎం.. కీలక మార్పులు

కాగా, సీఎం రేవంత్ కేబినెట్ లోకి విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మహిళతో భర్తీ చేయాలంటే కేకే కుమార్తె విజయ లక్ష్మి పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. ప్రస్తుత కేబినెట్ లో బీసీ మంత్రికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అదే విధంగా స్పీకర్ ప్రసాద కుమార్ ను సైతం కేబినెట్ లోకి తీసుకుంటారని.. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రిని స్పీకర్ గా చేస్తారని ప్రచారం సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల వేళ హైదరాబాద్ పరిధిలోని నేతకు అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. దీంతో.. ఢిల్లీ భేటీలో ఈ మొత్తం సమీకరణాల పైనా చర్చించి.. తుది రూపు ఇవ్వనున్నారు. అయితే.. కేబినెట్ ప్రక్షాళన మాత్రం వినాయక చవితికి ముందే జరగటం ఖాయమని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+