వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంటల తెలంగాణా ? మంటల తెలంగాణా ? తేల్చుకోమన్నకేసీఆర్ -మతోన్మాదుల్ని తరిమికొట్టండి..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ కీలక వ్యాఖ్యలుచేసారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మతోన్మాదుల చేతుల్లో పెట్టొద్దని ప్రజల్ని కోరారు. ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎలా చిచ్చుపెడుతోందో ఆయన వివరించారు.

 తెలంగాణపై కేసీఆర్ కామెంట్స్

తెలంగాణపై కేసీఆర్ కామెంట్స్

తెలంగాణ ఉద్యమం సమయంలో చైతన్యంగా ఉండటం వల్లే రాష్ట్రం సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
చిన్న ఏమరుపాటు, నిర్లక్ష్యం వల్ల 58 సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. మొన్న మొన్ననే బయటపడ్డామని, బయటపడ్డాక కలుగుతున్న సదుపాయాలు మీ కళ్లముందే కనిపిస్తున్నాయని ప్రజలకు తెలిపారు.

భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమం, సదుపాయాలు, రైతుల్ని ఆదుకునే పథకాలు ఇక్కడ ఉన్నాయిని, తెలంగాణలో అత్యధికులు చిన్న, సన్నకారు రైతులేనని కేసీఆర్ అన్నారు. రైతు చనిపోతే వారం రోజుల్లోనే బీమా అందుతోందని, ఇతర రాష్ట్రాల్లో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు.. తెలంగాణలో మాత్రం రైతుల నుంచి ప్రభుత్వం బియ్యం కొంటోందన్నారు. గతంలో దళారీ వ్యవస్ధలా కాకుండా ధాన్యం అమ్ముకుని వస్తే వారం రోజుల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. రెండో పంటకోసం రైతు బంధు డబ్బులుకూడా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. ఎవరికీ దండం పెట్టకుండా, ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్నాయని గుర్తుచేశారు. రైతులు అప్పులుతీసుకోవాల్సిన అవసరం లేకుండా, వడ్డీలు కట్టకుండా రైతులకు రైతుబంధు అందుతోందన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణమాత్రమేనన్నారు..

ఇతర రాష్ట్రాలకు వెళ్లి చూస్తే ఈ విషయం అర్ధమవుతుందన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు సరఫరా అయ్యే ప్రాంతాల్లో పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలలోనైనా ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి సొంత పాలన జరుగుతోంది కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయన్నారు.

 ఇలాంటి తెలంగాణా పోగొట్టుకుంటారా ?

ఇలాంటి తెలంగాణా పోగొట్టుకుంటారా ?

ఈ సదుపాయాలన్నీ మనం కాపాడుకోవాలా,పోగొట్టుకోవాలా అనేది ఆలోచించాలని ప్రజల్ని కేసీఆర్ కోరారు. నేను పోరాటం చేసి తెలంగాణ తెచ్చినవాడిని కాబట్టి, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి, మీ బిడ్డను కాబట్టి, ఏదేమైనా తెలంగాణను కాపాడాలని అనుకుంటున్నా కాబట్టి ఇదంతా చెప్తున్నా అన్నారు. పంటలు పండే తెలంగాణ కావాలా, మంటల తెలంగాణ కావాలా చెప్పండని ప్రశ్నించారు. ఇరుకైన, సంకుచితమైనటువంటి మతపిచ్చితో, మంటలు మండే రాష్ట్రమైతే మన భవిష్యత్తు దెబ్బతింటుందని కేసీఆర్ హెచ్చరించారు. నేను చెప్పేది నిజమో కాదో పెద్దలతో, మేథావులతో చర్చించాలని సూచించారు.

 కేంద్రం తీరుపై నిప్పులు

కేంద్రం తీరుపై నిప్పులు

భారత్ లో నిరంకుంశంగా ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం బావున్నా దేశం బావుండాలి, దేశ ఆదాయం పెరిగితే మనం కూడా బాగుపడతామన్నారు. కేంద్రం ఒక్కటంటే ఒక్కటైనా మంచిపని చేసిందా, కనపడుతోందా అని కేసీఆర్ ప్రశ్నింంచారు. గిరిజనులకా, బలహీనవర్గాలకా, రైతులకా, మహిళలకా ఓ ప్రాజెక్టు కట్టారా అని అడుగుతున్నామన్నారు. తెలంగాణ రాక ముందు కరెంటు ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని, తిప్పలు పడ్డాం కాబట్టి ఇప్పుడు 24గంటలు విద్యుత్ వస్తోందన్నారు. కేంద్రంలో ప్రధాని, కేంద్రమంత్రులు పెద్దమాటలు మాట్లాడుతున్నామన్నారు. వాళ్లు గొప్ప సిపాయిలు అయితే, తెలంగాణలో ఇచ్చే 24 గంటల కరెంటు ఎందుకు దేశమంతా ఇవ్వడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో తాగునీరు దేశమంతా ఇవ్వడంలేదు
నదుల్లో నీరు పారుతుంటే తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. మనం ఎడ్డోళ్లమా, గుడ్డోళ్లమా అని అడిగారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 24 గంటలు కరెంటు ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంటు ఉందా అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తే అధికారంలో ఉండాలి, తిరస్కరిస్తే విపక్షంలో ఉండాలి, కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రమే కుప్పకూలుస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. తమిళనాడులో, బెంగాల్లో గెలిచిన ప్రభుత్వాల్ని కూలుస్తామంటూ మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీలో కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే 25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటామంటున్నారు. ఇది రాజకీయమా, అరాచకత్వమా సమాధానం కావాలన్నారు.

 మతోన్మాదులపై కేసీఆర్ హెచ్చరిక

మతోన్మాదులపై కేసీఆర్ హెచ్చరిక

మనం మౌనంగా ఉండిపోతే మతపిచ్చి మంటలు వస్తాయని కేసీఆర్ ప్రజల్ని హెచ్చరించారు. మీ బిడ్డగా ఒకటే చెప్తున్నా. ఓ ఇల్లు కట్టాలంటే, రాష్ట్రం రావాలంటే, ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. పిచ్చితో, ఉన్మాదంతో రెండు, మూడు రోజుల్లో కూలగొట్టొచ్చన్నారు. కర్నాటక రాజధాని బెంగళూరు ఎవరు అవునన్నా కాదన్న సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. 30 ఏళ్లుగా ప్రయత్నిస్తే అది సిలికాన్ వ్యాలీ అయిందన్నారు. రెండోస్ధానంలో మన హైదరాబాద్ ఉందన్నారు. ఈ ఏడాది బెంగళూరు తక్కువ ఉద్యోగాలకు పరిమితమైందన్నారు. లక్షా 55 వేల ఉద్యోగాలు హైదరాబాద్ ఇస్తే బెంగళూరు ఇంకా తక్కువే ఇచ్చిందన్నారు. హిజాబ్ అంటూ జనాల్ని బెదిరిస్తే బెంగళూరులో ఉద్యోగాలు పోయాయన్నారు. తెలంగాణలోనూ అదే పరిస్ధితులు కావాలా, ఐటీ ఉద్యోగాలు పోవాలా, భూముల ధరలు పడిపోవాలా అని ప్రశ్నించారు. కొంతమంది పనికిమాలిన రాజకీయనేతలు రాష్ట్రాన్ని మతం కోసం మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. చిల్లర రాజకీయాల కోసం భారత సమాజాన్నే మోసం చేసే ప్రయత్నంచేస్తున్నారన్నారు. బీజేపీ ఎందుకిలా చేస్తోందని నిలదీశారు. మోడీకి ప్రధాని కంటే పెద్ద పదవి ఏది కావాలని అడిగారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరిగి, కరెంటు సదుపాయం వచ్చి 33 జిల్లాలు వచ్చి అభివృద్ధి జరుగుతోందని కేసీఆర్ తెలిపారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానీయను, సర్వశక్తులు ధారపోస్తాన్నారు. నా బలం అంతా మీరే, మీ ఆశీర్వాదం ఉన్నంతవరకూ ముందుకు దూసుకుపోదామన్నారు. మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మత పిచ్చికి లోనైన నాడు, చెదిరిపోయిన నాడు బతుకులు ఆగమైతాయన్నారు.స్వార్ధ, నీచ, మతపిచ్చిగాళ్లను తరిమికొట్టండి, మోసపోతే గోసపడతామన్నారు.
ఓసారి దెబ్బతింటే ఓ కూర్పు చెడిపోతే, అసూయ, ద్వేషం వస్తే తిరిగి బాగుపడటానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు.

English summary
telangana cm kcr on today ask people to decide between green telangana on communal telangana ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X