సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక: లాభాల్లో 30 శాతం వాటా
హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. 2021-22 సంవత్సరానికి గాను సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనుంది.2020 సంవత్సరంలోనూ సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో 28% వాటాను రాష్ట్రం ప్రభుత్వం దసరా కానుకగా అందించింది. అలాగే గత సంవత్సరం కూడా 29% వాటాను విజయదశమి కానుకగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈసారి గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

లాభాల్లో 30% వాటాను ఉద్యోగులకు దసరాలోపు అందించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సింగరేణి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించినందుకు గానూ.. సీఎం కేసీఆర్‌కు టీజీబీకేఎస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications