కెటిఆర్ చొరవతో అమెజాన్ ఆఫీస్! గోదావరి కోసం కెసిఆర్ భగీరథ ప్రయత్నం
హైదరాబాద్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన రెండో కార్యాలయాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అమెరికా వెలుపల ఆ సస్థ నిర్మించనున్న అతిపెద్ద కార్యాలయం హైదరాబాదులో నిర్మించనున్నదే కానుంది.
ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం ఉండనుంది. ఈ నెలలో శంకుస్థాపన జరిగే అవకాశముంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ హైదరాబాదు సమీపంలోని కొత్తూరు వద్ద గోదాముల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఫేస్‌బుక్, గూగుల్ వంటి కంపెనీలు హైదరాబాదులో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు అమెజాన్ కూడా హైదరాబాదులో ప్రధాన కార్యాలయ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు చర్చలు జరిపారు.

ఆసియాలోనే అమెజాన్ ప్రధాన కార్యాలయంగా హైదరాబాదుది నిలవనుంది. ఈ కార్యాలయం హైదరాబాదులో నిర్మిస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆమెరికా వెళ్లినప్పుడు అమెజాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
కెసిఆర్ భగీరథ ప్రయత్నం విజయవంతం
సీఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం ఫలించిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చొరవతో గోదావరి జలాల సమస్యకు పరిష్కారం దోరికిందన్నారు. మహారాష్ట్ర స్పందనతో గోదావరి జలాల సమస్య మనకు తీరిందన్నారు. పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు. అంతర్రాష్ట్ర సమస్యలను సమావేశాలతో పరిష్కరించుకుంటామని చెప్పారు.
కాగా, గోదావరిపై తెలంగాణ నిర్మించనున్న ఆనకట్టలకు మహారాష్ట్రతో ఒప్పందానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ సహా మొత్తం ఐదు ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ఈ అంతర్‌రాష్ట్ర ఒప్పందం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ల మధ్య ఈ నెల 8న జరగనుంది.
అంతర్‌రాష్ట్ర సమస్యలు, వివాదాలకు తావులేకుండా నిర్మాణాలు చేపట్టేందుకు తెలంగాణకు ఈ ఒప్పందం అత్యంత కీలకం కానుంది. ఈ నెల 8న ఒప్పందం చేసుకోవడానికి రావాల్సిందిగా మహారాష్ట్ర సీఎం కోరడంతో కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుతోపాటు అధికారుల బృందం ముంబై వెళుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications