సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా: మళ్లీ ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యాటన వాయిదా పడింది. ఫిబ్రవరి 14న అంటే మంగళవారం కొండగట్టుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ తన పర్యాటనను ఎల్లుుండికి వాయిదా వేసుకున్నారు. బుధవారంనాడు సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్లనున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు రేపటి పర్యటనను ఎల్లుండికి వాయిదా వేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇటీవలే ఇందు కోసం రూ. 100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

కొండగట్టులోనే ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఆదివారం సందర్శించారు. ఆగమశాస్త్రం ప్రకారమే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అధికారులు, అర్చకులతో చర్చించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయానికి రెండో ప్రాకార మండపం, పుష్కరిణి, విద్యుత్, గదులు, నీటి విసతి, మెట్ల దారి వెంట భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని ఆనంద్ సాయి తెలిపారు.












Click it and Unblock the Notifications