125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీపూల వర్షం కురిపించారు. పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తదితరులంతా చప్పట్లతో స్వాగతించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ జై భీమ్ అంటూ నినాదం చేశారు.

 ambethkar kcr

కాగా, దేశంలోనే అత్యంత ఎత్తైన బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని ఎత్తు 125 అడుగులు. ఈ విగ్రహం పార్లమెంటు తరహాలో 50 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహం మొత్తం ఎత్తు 175 అడుగులు.

విగ్రహం మొత్తం బరువు 474 టన్నులు అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఆర్మేచర్ నిర్మాణం కోసం 360 టన్నుల ఉక్కును ఉపయోగించారు. విగ్రహ తాపడం కోసం 114 టన్నుల కాంస్యాన్ని ఉపయోగించారు. దీని కోసం మొత్తం రూ.147 కోట్ల మేర వెచ్చించినట్లు సమాచారం. విగ్రహ పీఠం కింద మ్యూజియం, గ్యాలరీ, ఆడియో విజువల్ గది ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+