తొలిసారి ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్: సూచనలు
న్యూఢిల్లీ: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు కేసీఆర్. ఈ వారాంతం వరకు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.
పలు పార్టీల నేతలను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత కేసీఆర్ తొలి ఢిల్లీ పర్యటన కావడంతో ఆయన ఏ పార్టీ నేతలతో భేటీ అవుతారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం జోద్‌పూర్ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు.

కాగా, అంతకుముందు సీఎం కేసీఆర్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. ఇటీవల కన్నుమూసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు వెళ్లిన సీఎం.. ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ ఓదార్చారు.
@TelanganaCMO KCR visits the BRS office, Delhi.
— Sagar KV (@SagarVanaparthi) October 11, 2022
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్#hyderabad #Telangana #brs pic.twitter.com/9rK47dAydw
అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, తెరాస నేత శ్రవణ్‌కుమార్ ములాయం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి దిల్లీకి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications