ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ: ఉక్రెయిన్ రిటర్న్ విద్యార్థుల భవిష్యత్‌పై వినతి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అర్దాంతరంగా అక్కడ కాలేజీల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని ఈ లేఖలో కోరారు సీఎం కేసీఆర్.

ఉక్రెయిన్ రిటర్న్ విద్యార్థుల భవిష్యత్ కాపాడాలంటూ కేసీఆర్
మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతి ఇవ్వాలన్నారు. యుద్ధం కారణంగా దాదాపు 20వేలకుపైగా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి వచ్చారని, దేశవ్యాప్తంగా వివిధ వైద్యకళాశాలల్లో వారు చదువుకునేలా నిబంధనలు సడలించాలన్నారు. విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారున్నారని, తల్లిదండ్రులు జీవితాంతం సంపాదించిన డబ్బులతో పిల్లలను వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపారన్న సీఎం కేసీఆర్.. వారి భవిష్యత్‌ను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఉక్రెయిన్ రిటర్న్ తెలంగాణ విద్యార్థుల ఖర్చు భరిస్తానంటూ కేసీఆర్ లేఖ
ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యార్థుల కోసం సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికిపైగా ఉన్నారని, వారి విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా విద్యార్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు.

ఇటీవల అసెంబ్లీలో ఉక్రెయిన్ విద్యార్థుల సమస్యపై కేసీఆర్ ప్రస్తావన
కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌కు 700 మందికి పైగా విద్యార్థులు వెళ్లారని.. అందరూ డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ దేశానికి వెళ్లారని.. ఇక్కడ వసతి లేదు కాబట్టి ఆ దేశం పోయారని గుర్తుచేశారు సీఎం కేసీఆర్. అంతేగాక, అక్కడ ఫీజులు తక్కువనే వెళ్లారని చెప్పారు. ఇక, ఉక్రెయిన్ నుంచి వచ్చిన మా పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయినా సరే మేమే (తెలంగాణ ప్రభుత్వం) భరిస్తుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు కేసీఆర్. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న వారి ఖర్చు భరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదువు పూర్తి అయ్యేందుకు వారికి సహకరిస్తామని తెలిపారు కేసీఆర్.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications