నాంపల్లి కోర్టులో హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిపై నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్, బేగంబజార్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల విచారణ నిమిత్తం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కాగా, తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. సీఎం రేవంత్ నాంపల్లి కోర్టుకు హాజరవడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని టీపీసీసీ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ తిరుపతి వర్మ తెలిపారు.

Telangana CM Revanth Reddy appears in Nampally court

పీఏ కూతురు వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పీఏ కూతురు వివాహానికి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ మన్నెగూడలో బీఎంఆర్ సార్థ గార్డెన్స్‌లో గురువారం జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

సీఎం పర్సనల్ అసిస్టెంట్ (PA) పురుషోత్తంరెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి సహా పలువురు నాయకులు వివాహానికి హాజరయ్యారు.

మంచి మనసు చాటుకున్న సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు. కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు గూళ్ల రాకేష్ (Rakesh) గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌కు కావాల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు (Vemula Srinivasulu) రాకేష్ కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ చాలా కాలం సూడో మస్య్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు.

ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి వచ్చాడు. రాకేష్‌కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని, పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. తమ బిడ్డను ఆదుకోవడానికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+