Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైద‌రాబాద్‌ లో ఐఐఎం ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ను పార్ల‌మెంట్‌ లోని ఆయన ఛాంబర్‌ లో కలిశారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌ కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్‌లో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌ లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని సీఎం తెలిపారు.

ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ తో పార్ల‌మెంట్‌ లోని ఆయ‌న ఛాంబ‌ర్‌ లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయ‌ని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామ‌ని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు.

ఐఐఎం తరగతులు వెంట‌నే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉంద‌ని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్ప‌న‌కు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు సీఎం తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్ కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉంద‌ని, అనుకూల వాతావ‌ర‌ణం, భిన్న రంగాల ప్ర‌ముఖుల‌ను అంద‌జేసిన చ‌రిత్ర హైదరాబాద్‌ కు ఉంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుంద‌ని సీఎం వివరించారు.

మరోవైపు తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూత‌నంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉంద‌ని సీఎం అన్నారు.

Telangana CM Revanth Reddy Urges Centre to Sanction IIM for Hyderabad

కొమురం భీం ఆసిఫాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, కామారెడ్డి, జోగులాంబ గ‌ద్వాల‌్, నారాయ‌ణ‌పేట‌, నాగ‌ర్‌ క‌ర్నూల్‌, సూర్యాపేట‌, వికారాబాద్‌, నిర్మ‌ల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాల‌యాలు, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గద్వాల‌, మ‌హ‌బూబాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, మెద‌క్‌, ములుగు, నారాయ‌ణ‌పేట‌, పెద్ద‌ప‌ల్లి, రాజ‌న్న సిరిసిల్ల‌, వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తి, యాదాద్రి భువ‌న‌గిరి, నిర్మ‌ల్‌, ఆదిలాబాద్ జిల్లాలో జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రికి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+