తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. మిగతా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా, కాంగ్రెస్ పార్టీ నుండి విజయ అవకాశాలు ఉన్నవారికి కేటాయించి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు విజయం సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని టిపిసిసి చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ క్రమంలో 17 స్థానాలకు గాను నాలుగు సీట్లు ప్రకటించగా, నేడు మిగతా 13 స్థానాలలో మెజారిటీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇస్తారు అన్న దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించడానికి సీఈసీ నేడు, రేపు భేటీ కానుంది. ఇప్పటికే 82 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం ఇప్పుడు మూడవ జాబితాను ఫైనల్ చేయనుంది. దేశవ్యాప్తంగా పొత్తుల లో భాగంగా భాగస్వామ్య పక్షాలకు పోను, మిగిలిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది.
నేడు జరగనున్న సీఈసీ భేటీలో అగ్ర నేతలు పాల్గొని లిస్టు ఫైనల్ చేయనున్నారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోనీ తదితరులు పాల్గొననున్నారు. భాగస్వామ్య పక్షాలకు పోనూ, మిగిలిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది.
ఈ భేటీలోనే తెలంగాణలో గతంలో ప్రకటించిన స్థానాలకు మినహాయించి, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మూడవ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక నేటి సమావేశంలో అభ్యర్థుల ఖరారు చేయడంతో పాటు ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో పై కూడా ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications