Congress: యూపీ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు..
తెలంగాణ కాంగ్రెస్ నేతలు యూపీ బాట పట్టారు. యూపీలో కాంగ్రెస్ మద్దతుగా వీరంతా ప్రచారం చేయనున్నారు. దేశంలో ఇప్పటికే నాలుగు దశల లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో కూడా పలు నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో వచ్చే దశల్లో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నేత రాహుల్ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు.
రాహులు గాంధీకి మద్దతు ప్రచారం చేయడానికి టీ కాంగ్ నేతలు ఉత్తర ప్రదేశ్ వెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు దశలవారీగా యూపీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ప్రచారం చేయడానికి ఇప్పటికే మంత్రి సీతక్క, సీనియర్ నేత వీహెచ్ యూపీ వెళ్లారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు యూపీకి బయల్దేరారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా రాయ్ బరేలీలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఈసారి కూడా రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా రాహుల్ అక్కడ నుంచి పోటీ చేశారు. అక్కడ పోలింగ్ కూడా ముగిసింది. రెండో స్థానం రాయ్ బరేలీ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. మొదటగా ఆయన ఇక్కడ పోటీ చేయడానికి విముఖత చూపారు. అయితే పార్టీ నాయుకుల ఒత్తిడితో నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.
రాయ్ బరేలీలో మొన్నటి వరకు సోనియా గాంధీ గెలుపొందుతూ వచ్చారు. ఈసారి ఆమె పోటీ చేయడం లేదు. దీంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతారని వార్తలు వచ్చాయి. బీజేపీని తట్టుకోవాలంటే రాహులే సరైన వ్యక్తిగా భావించిన పార్టీ అధిష్ఠానం.. ఆయన్ను పోటీ చేయాలని కోరింది. ఇక్కడ బీజేపీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications