హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమాలవల్లే: కార్తీకరెడ్డి పైనా జయసుధ, కేసీఆర్‌పై ఉత్తమ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం స్పష్టం చేశారు. తనను పార్టీనుంచి సస్పెండ్ చేశారన్న వార్త విని షాక్‌కు గురయ్యానన్నారు. ఆమె పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు.

అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. జయసుధ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆమె ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తారన్నారు. జయసుధ మాట్లాడుతూ... సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదన్నారు.

మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో తనకు విభేదాలు లేవని చెప్పారు. సినిమా షూటింగుల కారణంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నానని జయసుధ వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో మాట్లాడారు.

జయసుధ

జయసుధ

తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సినీ నటి జయసుధ స్పష్టం చేశారు. తనను పార్టీనుంచి సస్పెండ్ చేశారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని ఆమె చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

గ్రేటర్ ఎన్నికల్లో విజయంతో పాటు రానున్న కాలంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోను విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అధిష్టానం జోక్యం చేసుకోదని కుంతియా కాంగ్రెస్ నేతలకు చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

అమరవీరుల త్యాగాల ఫలితం, కాంగ్రెస్ పార్టీ సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ఏర్పాటుతో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మండిపడింది.

English summary
Telangana Congress leaders plan public meeting in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X