ఆ చిన్నారుల సిరప్ విషపూరితం- వెంటనే నిలిపివేయండి: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అల్మాంట్-కిడ్ సిరప్ (Almont-Kid Syrup) వాడకంపై హెచ్చరిక జారీ చేసింది. కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి అందిన ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ సిరప్‌లో అత్యంత విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ అయినట్లు గుర్తించింది. వీటి నమూనాలు లభించినట్లు తెలిపింది. ప్రజలు వెంటనే దీని వినియోగాన్ని నిలిపివేయాలని సూచించింది.

అల్మాంట్ కిడ్ సిరప్, బ్యాచ్ నంబర్ ఏఎల్- 24002. తయారీ తేదీ జనవరి-2025, గడువు తేదీ డిసెంబర్ 2026. దీన్ని బీహార్‌లోని హాజీపూర్, ప్లాట్ నంబర్ డీ-42, డీ-43, ఫేజ్- 2, ఇండస్ట్రియల్ ఏరియాలో గల ట్రైడస్ రెమిడీస్ ఉత్పత్తి చేసింది. దీన్ని వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ సూచించింది. ఇటువంటి సిరప్ ఉన్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని, వెంటనే వాడకాన్ని ఆపివేయాలని సూచించింది.

Telangana DCA says Stop Using Almont-Kid Syrup Adulterated with Ethylene Glycol

ఈ సిరప్ తమ వద్ద ఉన్న విషయాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. లేదా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు నేరుగా టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని సూచించింది. ఈ సేవలు అన్ని పనిదినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

అల్మాంట్ కిడ్ సిరప్ గురించి ఆరా తీయాలని రాష్ట్రంలోని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ తక్షణ ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని రిటైలర్లు, హోల్‌సేలర్లు, పంపిణీదారులు, ఆసుపత్రులు ఈ ఉత్పత్తి బ్యాచ్ స్టాక్‌లను స్తంభింపజేయాలని, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విక్రయించకూడదని స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్యానికి మరింత హాని జరగకుండా అవసరమైన అమలు చర్యలు చేపట్టి, పరిస్థితిని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత ప్రభావాల నుండి రక్షణకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండి, పైన పేర్కొన్న సిరప్‌ను ఉపయోగించవద్దని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+