తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రేపు ఉదయం విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాసిన విద్యుర్థుల ఎదరుచూపులకు తెరపడనుంది. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతోపాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించింది. ఈ క్రమంలో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు.

జులై 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్, 30,31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ కు 1,56,812 మంది, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.












Click it and Unblock the Notifications