బాలికపై అసభ్యకరంగా: నలుగురి ప్రాణం తీసిన అనుమానం: ఆటోడ్రైవర్ కుటుంబం విషాదంతం
మేడ్చల్: తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్.. తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత తన భార్య, కుమార్తె, కుమారుడికి ఉరివేసిన అనంతరం.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి కారణం- అనుమానాలే. మృతుడు- ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు స్థానికులు ఆరోపించడం.. అతనిపై దాడికి పాల్పడటమే ఆ కుటుంబం ఆత్మహత్యకు దారి తీసినట్లు భావిస్తోన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను బిక్షపతి, అతని భార్య ఉష, కమారుడు యశ్వంత్, కుమార్తె హర్షిణిగా గుర్తించారు. బిక్షపతి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఆటో నడుపుకొంటూ పొట్టపోసుకుంటోన్నాడు. భార్యాపిల్లలతో కలిసి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్ గాంధీనగర్‌లో నివసిస్తోన్నాడు. అతని స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం రేణిగుంట గ్రామం. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన బిక్షపతి నాగారంలో నివాసం ఉంటోన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం వల్ల ఇంటివద్దే గడుపుతున్నాడు.

ఈ క్రమంలో అతనిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. వెస్ట్ గాంధీనగర్‌లో తన ఇంటి పక్కనే నివసిస్తోన్న ఓ బాలిక పట్ల బిక్షపతి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడంటూ స్థానికులు చెబుతున్నారు. మరోసారి కూడా ఆ బాలిక పట్ల అశ్లీలంగా ప్రవర్తించాడనే కారణంతో రాత్రి స్థానికులు అతనిపై దాడి చేశారు. 50 మంది అతనిపై దాడి చేసినట్లు బిక్షపతి సోదరి చెబుతున్నారు. ఈ ఉదయం పెద్దల సమక్షంలో పంచాయితీ పెడదామని, కాలనీలో నివాసం లేకుండా చేస్తామని హెచ్చరించారు. తన ప్రమేయం ఏమీ లేదని అతను చెప్పుకొన్నప్పటికీ స్థానికులు వినిపించుకోలేదు. ఇది బిక్షపతిని తీవ్రంగా కలచి వేసింది. అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

దీనితో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. మొదట భార్య, పిల్లలకు ఉరివేసిన అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారి మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే కీసర పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్ మృతదేహాలను మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతన్ని కొట్టినవారే హత్య చేశారా? అనేది తెలియట్లేదని బిక్షపతి సోదరి ఆరోపిస్తున్నారు.
బాలికపై అసభ్యకరంగా: నలుగురి ప్రాణం తీసిన అనుమానం: ఆటోడ్రైవర్ కుటుంబం విషాదంతం#Coronavirus #Covid19 #Telangana #Hyderabad pic.twitter.com/a9ZllXjPPQ
— oneindiatelugu (@oneindiatelugu) June 4, 2021












Click it and Unblock the Notifications