Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తేలిన ఉద్యోగ ఖాళీల లెక్క-ఈసారైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా-నిరుద్యోగులకు తీపి కబురు చెబుతుందా?

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల అంశం.. అలా తెర పైకి రావడం... కొద్దిరోజులకే మరుగనపడటం కామన్ అయిపోయింది. నోటిఫికేషన్లు ఇస్తున్నామని ప్రభుత్వం హడావుడి చేయడం.. ఇంతలోనే ఖాళీల లెక్క ఇంకా తేలలేదని,రిపోర్టులు అసమగ్రంగా ఉన్నాయని వాయిదా వేయడం జరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలపై నిరుద్యోగుల్లో తీవ్ర నిస్తేజం,అసంతృప్తి నెలకొన్నాయి. తాజాగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఖాళీల లెక్కను రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్దారించింది.దీంతో ఈసారైనా ప్రభుత్వం నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా... నిరుద్యోగులకు తీపి కబురు చెబుతుందా అనే చర్చ జరుగుతోంది.

తేలిన ఉద్యోగ ఖాళీల లెక్క...

తేలిన ఉద్యోగ ఖాళీల లెక్క...

రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో మొత్తం 67,820వేల ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ నిర్దారించింది. తుది నివేదికను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రేపో మాపో దాన్ని ప్రభుత్వానికి సమర్పించనుంది. నిజానికి గత మే నెలలోనే ఉద్యోగ ఖాళీల వివరాలతో కూడిన నివేదిక కేబినెట్‌ ముందుకు వచ్చింది. నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించారు. అయితే నివేదిక అసమగ్రంగా ఉందన్న కారణంతో దాన్ని తిరస్కరించారు. మరోసారి కసరత్తు చేసి కచ్చితమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయా శాఖల్లోని ఖాళీలన్నీ లెక్క తీసిన అధికారులు మొత్తం ఖాళీలను నిర్దారించారు.

నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా...

నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా...

ఖాళీల వివరాలతో కూడిన నివేదిక కేబినెట్‌కు చేరాల్సి ఉంది. కేబినెట్ ఆమోద ముద్ర పడితే నోటిఫికేషన్లు విడుదలవుతాయి. అయితే కేబినెట్ ఈసారైనా నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికకు ముందే నోటిఫికేషన్ ఇస్తారా.. లేక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే దాకా వేచి చూసి... ఉపఎన్నిక అయిపోయాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని చెబుతారా అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఇది ఎన్నికల స్టంటే అనే విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు,నిరుద్యోగులు ఈ విమర్శలు చేస్తున్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్ఎస్‌కు ఉద్యోగాల నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని... ఆ తర్వాత దాని సంగతి మరిచిపోవడం కామనే అని అభిప్రాయపడుతున్నారు.

నిరాశలో నిరుద్యోగులు... నెలలు గడిచినా...

నిరాశలో నిరుద్యోగులు... నెలలు గడిచినా...

గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసింది. దాదాపు 8 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. మధ్యలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక,ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో... వాటి తర్వాత నోటిఫికేషన్లు వస్తాయేమోనని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారు. కానీ నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రేపు,మాపు అంటూ ప్రభుత్వం దీన్ని సాగదీస్తూనే ఉంది. నీళ్లు,నిధులు,నియామకాలు అనే నినాదంపై ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వం నియామకాలను అటకెక్కించిందని... నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని... మరో 50వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని చెబుతూ వస్తోంది. కానీ ఇప్పటికీ ఆ 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాలేదు. మరోవైపు ఏజ్ బార్ అయిపోయి కొంతమంది నిరుద్యోగులు అనర్హులుగా మారుతున్న పరిస్థితి. వారికి వయసు సడలింపునిచ్చే చర్యలేవీ ఇప్పటివరకూ తీసుకోలేదు.

ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగులు...

ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగులు...

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి.. ఇప్పటికే కొంతమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 35-40 ఏళ్లు నిండుతున్నా ఉపాధి,ఉద్యోగం లేక, పెళ్లి కాక, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన స్థితిలో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు 30 మంది యువతీ యువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని కలత చెంది, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడం,ఆత్మహత్యలు కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు...

ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు...

నిజానికి తెలంగాణలోని వివిధ ప్రభుత్వశాఖల్లో మొత్తం 3 లక్షల 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే వాదన ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు ఏమాత్రం సుముఖంగా లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక... ఏడేళ్లుగా ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆర్టీఐ సమాచారం ప్రకారం ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 35,460 మాత్రమే కాగా...ప్రభుత్వం మాత్రం 1లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోంది. మరోవైపు,నిరుద్యోగ భృతి అంశాన్ని కూడా ప్రభుత్వం అటకెక్కించింది. గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చారు. ప్రతీ నిరుద్యోగికి రూ.3వేలు భృతి చెల్లిస్తామన్నారు. కానీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.

ఇవాళ మంచిర్యాలలో షర్మిల దీక్ష

ఇవాళ మంచిర్యాలలో షర్మిల దీక్ష

ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షల్లో భాగంగా మంగళవారం(ఆగస్టు 24) వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టారు.గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్‌ ఇంటి వద్ద దీక్ష చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వంద నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్‌ వేయించనున్నట్లు సోమవారం(ఆగస్టు 23) ఆ పార్టీ నేత ఒకరు ప్రకటించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ 28 నెలలుగా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని చెల్లించాలని వైఎస్సార్‌టీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలకు పాల్పడ్డ నిరుద్యోగుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎదిగొచ్చిన బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయని... ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+