వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్... చేపల కోసం వల విసిరితే ఏం చిక్కుకుందో ఓ సారి చూడండి..!

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: సూర్యాపేటలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ భారీ మొసలి చిక్కింది. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం యతవకిల్లా గ్రామంలో నివసించే మత్స్యకారులు చేపల వేట కోసం శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఇక చెరువు దగ్గర చేపలు పట్టేందుకు వల విసిరారు. అయితే వల ఒక్కసారిగా బరువెక్కింది. ఏదో పెద్ద చేప వలలో చిక్కుకుని ఉంటుందని ఈ మత్స్యకారులు భావించారు. తీరా బయటకు వలను తీయగా భారీ మొసలిని చూసి షాక్‌కు గురయ్యారు.

వలలో చిక్కుకున్న భారీ మొసలిని చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు మధర్ అనే మత్స్యకారుడు. మరో నలుగురు మత్స్యకారుల సహాయంతో మొసలి జారిపోకుండా పట్టుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఓ మొసలి తిరుగుతోందని అంతకుముందే వార్తలు వచ్చాయి. చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ఎప్పుడూ ఒక భయంతోనే తాము చెరువులోకి వేటకు వెళ్లేవాళ్లమని చెప్పారు. చేపలు పట్టి దగ్గరలోని మార్కెట్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు చెప్పిన మత్స్యకారులు ఇన్ని రోజులు ఓ మొసలి తిరుగుతోందని వస్తున్న వార్తలు నిజమేనని తెలుసుకున్నట్లు చెప్పారు. మొసలి అక్కడ సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మలేదని అయినప్పటికీ కాస్త జాగ్రత్తగానే ఉండేవారమని చెప్పుకొచ్చారు. ఇక మొసలి చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు.

Telangana: Fishermen goes into a shock after a crocodile caught in his net

మొసలిని జాగ్రత్తగా బంధించి ఆ సమాచారంను గ్రామ సర్పంచి దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గతేడాది భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షం నీటిలో మొసళ్లు ప్రత్యక్షమైన వార్తలను చూశాము. భారీ వర్షాలకు లేదా వరదలకు మొసళ్లు ఈదుకుంటూ నివాస ప్రాంతాల్లోకి కూడా వచ్చాయి. మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి రావడంతో అక్కడి ప్రజలు కొద్దిరోజుల పాటు భయాందోళనలో గడిపారు. అయితే అటవీశాఖ సిబ్బంది వచ్చి వాటిని పట్టుకుని జూకు తరలించడం జరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో నిజామాబాదులో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహించడంతో ఓ మొసలి నీటిలో

English summary
Fishermen from Mattampally Mandal, Yatavakilla village of Suryapet district captured a huge crocodile and tied it all over with ropes in the wee hours of Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X