వెంటాడుతున్న గ్యాస్ లీకేజ్: విశాఖ ఘటన భయపెడుతుండగానే.. ఈ సారి సిర్పూర్ పేపర్ మిల్లులో.. !
హైదరాబాద్: గ్యాస్ లీకేజీ ఘటనకు బ్రేక్ పడట్లేదు. తెలంగాణలో కూడా విశాఖ తరహా ఉదంతం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువు వెలువడిన ఘటన ఇంకా విశాఖపట్నాన్ని నిలువెల్లా వణికిస్తూనే ఉంది. అదే సమయంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ అదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్‌తో పోల్చుకుంటే దీని తీవ్రత చాలా తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం.
Recommended Video
తెలంగాణ కొమరంభీం జిల్లాలో కాగజ్‌నగర్‌లో గల సిర్పూర్ పేపర్ మిల్లులో సోమవారం ఉదయం గ్యాస్ లీక్ అయింది. దీన్ని క్లోరిన్ గ్యాస్‌గా నిర్ధారించారు అధికారులు. ఈ ఘటనలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తోన్న ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.

గ్యాస్ లీకైన సమయంలో సంఘటనా స్థలంలో 22 మంది కాంట్రాక్టు కార్మికులు విధి నిర్వహణలో ఉన్నట్లు తేలింది. గ్యాస్ వెలువడిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెద్దగా ఎవరూ అస్వస్థతకు లోను కాలేదని సమాచారం. ఈ సమాచారం అందిన వెంటనే సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే నివారణ చర్యలను తీసుకుంది. క్లోరిన్ గ్యాస్ పైప్‌లో మరమ్మతులను చేపట్టింది. మరమత్తులు చేయించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 24 గంటల పాటు పరిశ్రమను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో మూడు షిఫ్టుల్లో కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. తొలి షిఫ్ట్ ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణకు హాజరైన కొద్దిసేపటికే క్లోరిన్ గ్యాస్ విడుదలైంది. సంస్థలో మొత్తం మూడు క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు ఉండగా.. అందులో ఒకదాని నుంచి క్లోరిన్ విడుదలైనట్లు సమాచారం. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరిన్ గ్యాస్ వెలువడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications