గుడ్‌న్యూస్: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఈ జిల్లాల్లోనే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట్, మెద‌క్, ములుగు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పదివేలకు చేరువకానున్నాయి.

telanganagovernmentannounces8newmedicalcolleges

కాగా, ఒక్కో జిల్లాకు ఒక్క మెడిక‌ల్ కాలేజీ ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ క‌ల సాకారం అవుతోంది. ప్ర‌తి జిల్లాకు ఒక ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ క‌లిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. దీంతో తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుంది. ఈ 9 ఏళ్ల కాలంలో 29 కొత్త ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసింది.

ఈ మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేల‌కు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ‌య్యాయి. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి వాఖ్యానించారు.

మరోవైపు, 2014 జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లోని కాంపిటేటివ్‌ అథారిటీ (కన్వీనర్‌) కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్‌ 371 డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేసినట్టు పేర్కొంది.

గతంలో కన్వీనర్‌ కోటాలో స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే రిజర్వేషన్‌ ఉండేది. మిగతా 15 శాతం అన్‌ రిజర్వుడ్‌ క్యాటగిరీ. ఇందులో తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్‌ సీట్లు అదనంగా లభించనున్నాయి. కొత్త మెడికల్‌ కాలేజీలలో 15 శాతం ఆలిండియా కోటా యథాతథంగా ఉండనుంది. ఇందులో తెలంగాణ, ఏపీతోపాటు దేశంలో ఎకడి విద్యార్థులైనా మెరిట్‌ ప్రకారం అడ్మిషన్‌ పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+