పదో తరగతి ఇంటర్నల్ మార్కుల రద్దుపై సర్కారు వెనక్కి
పదో తరగతి పరీక్ష విధానంపై తెలంగాణ ప్రభుత్వం గురువారం తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం వెనక్కి తీసుకుంది. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్య సంవత్సరానికి నిలిపివేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తూ విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది.

2024-25 విద్య సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చాయి. ఆ గ్రేడింగ్ సిస్టంను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అయితే, ఇలాంటి నిర్ణయాలను విద్య సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, కేవలం పరీక్షలకు 4 నెలల ముందు వెల్లడించడంపై విద్యారంగ నిపుణులు, పలు విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. మూడు నెలల 10 రోజులకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇప్పటికే సమ్మెటివ్ అసెసె్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు పూర్తయ్యాయి. ీ క్రమంలో విద్యారంగ నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2025-26 నుంచి నూతన మార్కుల విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications