ఆర్టీసీ సమస్యతో మాకు సంబంధం లేదు : ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, మరియు ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ మధ్య వివాదానికి కారణమవుతోంది. ఆర్టీసీ కార్మీకులు, ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోరిన నేపథ్యంలోనే వారు సీఎం కేసీఆర్ అపాయింట్‌‌ రావడంతో ఆర్టీసీ జేఏసీ సమావేశానికి దూరంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వారిపై ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై వారు ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్‌ను కలిస్తే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకే సీఎం కలిశామని చెప్పారు. చర్చల ద్వారనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కోన్ననేతలు ప్రభుత్వ ఉద్యోగులపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చర్చల్లో బాగంగానే ఆర్టీసీ సమస్యలను కూడ చర్చిస్తామని చెప్పారు.

Telangana government employees differed with the rtc strike

మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటీ సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తోటి ఉద్యోగ సంఘాల మద్దతు కోరడంలో తప్పులేదని, కాని మద్దతు తెలపని వారిపై బెదిరింపులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.. కాగా ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా పెన్‌డౌన్ చేయాలనే ప్రస్తావన కూడ వచ్చిన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారని,. ఆర్టీసీ జేఏసీ నాయకులతో సమావేశం ఉన్న రోజునే ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఇచ్చి వారితో చర్చలు జరగకుండా అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+