వారితో పాటు ఏపీ సీఎం చంద్రబాబునూ పిలుద్దాం: అధికారులతో కేసీఆర్
హైదరాబాద్: వచ్చే నెల నుంచి హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించాలని నిర్ణయించింది. తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ సీఎంను కూడా అందరు ప్రముఖులతో పాటు ఆహ్వానిద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం జరిపిన సమీక్షలో తెలిపారు.
ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముగింపు సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను ఆహ్వానిస్తున్నారు. మారిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ప్రారంభ సభకు హాజరవుతారని కేసీఆర్ తెలిపారు.

సమీక్షలో వీరు
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, సీఎస్, డీజీపీ, నందిని సిధా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలుగు భాసాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవెత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్నారు.

వీరితో పాటు తెలుగు మాట్లాడే ముఖ్యమంత్రులు
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితోపాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలని కేసీఆర్ చెప్పారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందిన సాహితీవేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి సన్మానించలని కేసీఆర్ నిర్ణయించారు. అతిథులకు బస, భోజనం, రవాణాలాంటి సదుపాయాల కల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక్కో వేదిక వద్ద ఒక్కో ఇంచార్జ్ ఉండాలన్నారు.

చంద్రబాబును కూడా ఆహ్వానిస్తాం
ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మరిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరవుతారని సీఎం తెలిపారు. చంద్రబాబును కూడా సభలను ఆహ్వానించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలుగు మహాసభల ప్రధాన వేదిక, ఎల్బీ స్టేడియం వేదిక డిజైన్, నగరంలో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను పరిశీలించిన వాటిని ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.

తెలంగాణ సంప్రదాయం ప్రతిబింభించే లేజర్ షో
భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. మిగతా వేదికల వద్ద ప్రతీ రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, ఎల్బీ స్టేడియంలో ప్రతీ రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించే లేజర్ షో నిర్వహించాలన్నారు.

నగరం పండుగ శోభ
పండుగ శోభను సంతరించుకోవాలని, ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని, జంక్షన్లను అలంకరించాలని, తెలుగు సాహితీ మూర్తుల పేర్లతో తోరణాలుండాలని, హైదరాబాద్ అంతా బెలూన్లు ఎగురవేయాలని, తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూ కవి సమ్మేళనం, ఖవ్వాలి లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ చెప్పారు. వచ్చిన అతిథులకు బస, భోజనం, రవాణా లాంటి సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications