TSEAMCET 2023: స్టూండెట్స్..బీ అలర్ట్: కీలక తేదీలు ఇవే
తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడింది. కొద్దిసేపటి కిందటే అధికారులు దీన్ని విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడింది. కొద్దిసేపటి కిందటే సాంకేతిక విద్య మంత్రిత్వ శాఖ అధికారులు దీన్ని విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి దీన్ని విడుదల చేశారు.

సీబీటీ ఎగ్జామ్స్..
రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. యూనివర్శిటీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, అఫ్లియేటెడ్ ప్రొఫెషనర్ కాలేజీల్లో తొలి ఏడాది ప్రవేశాన్నిపొందడానికి టీఎస్ ఎంసెట్ 2023 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంజినీరింగ్..
బీఈ, బీటెక్, బయో టెక్, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీల్లో బీఎస్సీ (హాన్స్), బీఎస్సీ నర్సింగ్, డీ ఫార్మసీ, వెటరినరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. వంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్ పరీక్షల్లో ర్యాంకును సాధించాల్సి ఉంటుంది.

తేదీలు ఇవే..
ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెల 28వ తేదీన వెలువడుతుంది. మార్చి 3వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆలస్యపు రుసుము లేకుండా- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ.. ఏప్రిల్ 4. ఆన్ లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు ఉంటే ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు సవరించుకోవచ్చు.

ఆలస్యపు రుసుముతో..
ఆలస్యపు రుసుముతో దరఖాస్తులను దాఖలు చేయడానికి వేర్వేరు రకాల చివరి తేదీలను నిర్ణయించారు అధికారులు. 250 రూపాయల ఆలస్యపు రుసుముతో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను దాఖలు చేయవచ్చు. 500 రూపాయలతో ఏప్రిల్ 20వ తేదీ వరకు, 2,500 రూపాయలతో ఏప్రిల్ 25వ తేదీ వరకు, 5,000 రూపాయల ఆలస్యపు రుసుముతో మే 2వ తేదీ వరకు విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించవచ్చు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..
ఏప్రిల్ 30వ తేదీన అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 7, 8, 9,10, 11 తేదీల్లో ఎంసెట్ పరీక్షలను అధికారులు షెడ్యూల్ చేశారు. ఇంజినీరింగ్ పరీక్షలు 7,8,9 తేదీల్లో షెడ్యూల్ అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షెడ్యూల్ అయ్యాయి.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications