కేసీఆర్ బంపర్ ఆఫర్: ఆక్రమిస్తే రెగ్యులరైజ్, కానీ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది! ఎన్ని ఎకరాలనైనా కబ్జా భూమిని క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువ కట్టి ఎంత భూమినైనా క్రమబద్ధీకరించుకోవచ్చు. అయితే ఆ స్థలంలో తప్పనిసరిగా నిర్మాణం ఉండితీరాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు మంగళవారం రాత్రి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా జీవోలు58, 59ని జారీ చేశారు. ఇప్పటిదాకా జీవోనెం.166 ద్వారా కేవలం 2000 గజాల్లోపు భూమిని మాత్రమే క్రమబద్ధీకరించుకునే అధికారం ఉండేది. కొత్త జీవోలో ఆ పరిమితిని తొలగించారు.
ఎంత భూమినైనా క్రమబద్ధీకరించే అధికారాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) నేతృత్వంలోని క్రమబద్ధీకరణ కమిటీకి ఇచ్చారు. ఆర్డీవో నేతృత్వంలోని కమిటీ దరఖాస్తును తిరస్కరిస్తే, జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకొని క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు విద్యుత్ అంశం పైన సచివాలయంలో సమీక్ష నిర్వహించిన దృశ్యం.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు వాటర్ గ్రిడ్ పైన సచివాలయంలో సమీక్ష నిర్వహించిన దృశ్యం.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు వాటర్ గ్రిడ్ పైన సచివాలయంలో సమీక్ష నిర్వహించిన దృశ్యం. వాటర్ గ్రిడ్ ఏరియల్ వ్యూ చిత్రం.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు వాటర్ గ్రిడ్ పైన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications