తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ. లక్ష లోపు రుణమాఫీ..!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని పథకాలను ప్రారంభిస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పథకం.. లాంటి కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా వారికోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఈ మేరకు యాదాద్రి జిల్లాలోని 2,380 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.19.24 కోట్ల నగదును విడుదల చేసింది. ఈ విషయాన్ని జిల్లా కమిటీ ప్రకటించింది. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్న రూ. లక్ష లోపు రుణాలను తాజాగా మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే చేనేత వస్త్రాల ఉత్పత్తి, నిర్వహణ, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలు రుణమాఫీ పరిధిలోకి వస్తాయని రేవంత్ సర్కార్ పేర్కొంది.


మరోవైపు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్లు విడుదల చేసిందని, ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5691 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారని, త్వరలోనే పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి, నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక యాదాద్రి జిల్లాలో మొత్తం 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. వీటిలో వేలమంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు యాదాద్రి జిల్లాలోని 39 బ్యాంకుల్లో చేనేత కార్మికులు వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నారు. వీరిలో 1,162 మంది కార్మికులు రూ. లక్షలోపు రుణం తీసుకున్నారు. ఈ మొత్తం రూ. 6 కోట్లు కాగా.. మరో 1,537 నేతన్నలు రూ. లక్షకు పైగా.. రూ. 24 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.

Telangana Government Waives Rs 1 Lakh Farmer Loans Disburses Rs 19 24 Crore in Yadadri

ఇక నేతన్న పొదుపు పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 33,913 మంది చేనేత కార్మికులు నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వేతనంలో 8శాతం మొత్తాన్ని బ్యాంకులలో జమచేస్తే ప్రభుత్వం 16 శాతం మొత్తాన్ని RD -11 ఖాతాలలో జమచేస్తుంది. అంతేకాక తెలంగాణ నేతన్నకు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 48.8 కోట్లు కేటాయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+