రైతులకు గుడ్ న్యూస్.. డబ్బులు చెల్లించనున్న ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం 'ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన'లో రైతుల వాటాను తెలంగాణ ప్రభుత్వమే చెల్లించబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతునేస్తం పథకంలో భాగంగా 2024 వర్షాకాలం నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు పండించే అన్ని పంటలకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో రాష్ట్ర రాయితీతోపాటు రైతల వాటా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరించనుందన్నారు.

పంట నష్టపోయిన సందర్భాల్లో పరిహారం చెల్లింపులు ఆలస్యంగా జరిగేవని, కొన్ని సందర్భాల్లో 2 నుంచి 3 సంవత్సరాల సమయం కూడా పట్టిందన్నారు. ఇకనుంచి అటువంటి సమస్య తలెత్తదని, క్రాపిక్, విండ్స్, ఎస్ టెక్ లాంటి టెక్నాలజీద్వారా శాటిలైట్‌ ఇమేజరీ అప్లికేషన్లు, డేటాను ఉపయోగించి పంట దిగుబడులను, పంట నష్టాలను తక్షణమే నిర్ధారిస్తారన్నారు. ఆ తర్వాత వెంటనే నగదు బదిలీ అవుతుందన్నారు.

telangana government will pay pmfby scheme crop insurance

ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. 2016 నుంచి 2020 వరకు రాష్ట్రంలో ఈ పథకం అమలైనప్పటికీ రైతులకు అనుకూలంగా లేదనే కారణంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకు వచ్చింది. 2020 నుంచి తెలంగాణలో ఎటువంటి పంటల బీమా అమలవలేదు. ఏదో ఒక బీమా పథకం ఉంటే మంచిదనే భావన అందరి రైతుల్లో నెలకొంది. నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో చేరింది. వ‌చ్చే పంటల కాలం నుంచి రైతులు బీమా పొంద‌నున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+