ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!!

రైతుల నిరీక్షణ ఫలించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు వేచి చూస్తున్న బకాయిల విడుదలకు అంగీకరించింది. ఈ మేరకు నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో పూర్తిగా అర్హులైన ప్రతీ రైతుకు ఈ బకాయిలు వారి ఖాతా ల్లో జమ కానున్నాయి. ఇప్పటికే ఈ నిధుల విడుదల పైన రాజకీయంగానూ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు తీపి కబురు అందించింది. చాలా రోజులుగా వారికి రావాల్సిన బకాయిల కోసం వేచి చూస్తున్నారు. తాజాగా వారి బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు, మూడు రోజుల్లో రైతుల అకౌంట్లో నగదు జమ కానున్నాయి. మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు మార్క్‌ఫెడ్‌కు రూ.171 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అవి మార్క్‌ఫెడ్ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.

Telangana Govt credits the arrears for Rs 171 cr in to the 3 77 laksh Miaze farmers accounts here the details

వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న రైతుల నుంచి సేకరించింది. దాదాపు 78,500 మంది రైతులు వీటిని విక్రయించారు. తొలి దశలో మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.735.39 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు రూ.171 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధుల పెండింగ్ లో ఉంచటం పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది.

రైతు భరోసా నిధులు ఎప్పుడు

ఇప్పుడు ప్రభుత్వం విడుదల ఉత్తర్వులు ఇవ్వటంతో.. ఇక, రానున్న రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొక్కజొన్నలు విక్రయించి నాలుగు నెలలు అయినా డబ్బు లు రాకపోవడంతో రైతులు నిరాశ చెందారు. యాసంగి సీజన్‌కు పెట్టుబడి పెట్టుకోవడానికి నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వస్తోంది. అధికారులు, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో పంట విక్రయించి న తర్వాత వారానికి ఒకసారి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి.

కానీ జనవరి 17 నుంచి నిధులు జమ కావడం లేదు. దీంతో సొమ్ము రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు ముగిసి చాలా రోజులైన ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రైతు భరోసా నిధుల విడుదల పైన ప్రభుత్వం నుంచి స్పష్టత రావటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+